Motorola Edge 70 Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా మార్కెట్‌లోకి మొబైల్స్‌ను అత్యంత చౌవక ధరలోనే విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ మోటార్ల ఎడ్జ్ 70 (motorola edge 70) పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మోడల్ మొబైల్ గతంలో కంపెనీ విడుదల చేసిన అన్ని మోడల్స్ కంటే ఎంతో ప్రీమియం లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ చాలా అద్భుతమైన ఫీచర్లతో విడుదల చేయబోతోంది. దీనిని ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో లాంచ్ చేయబోతోంది. కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ధర వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు లీక్ అవుతూ వస్తున్నాయి.
మోటరోలా ఎడ్జ్ 70 మొబైల్ అతి త్వరలోనే కంపెనీ అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది మోస్ట్ ప్రీమియం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు కూడా సమాచారం. ఇక ఈ మొబైల్ ను కంపెనీ వివిధ స్టోరేజ్ వేరియన్స్‌తో పాటు అనేక రంగులు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్‌ని కూడా కలిగి ఉంటుంది.. ఇది మొబైల్‌కు మంచి డిజైన్ కూడా అందిస్తున్నట్లు లీకైన ఫోటోల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని 5.99 మిమీ మందంతో సన్నని డిజైన్‌లో కనిపించబోతోంది.
ఇక ఈ motorola edge 70 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 6.67-అంగుళాల pOLED సూపర్ HD డిస్‌ప్లేతో లాంచ్ చేయబోతోంది. అంతేకాకుండా 1,220 x 2,712 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇక ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు కంపెనీ దీని బేస్ వేరియంటను 12gb ర్యామ్ తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అలాగే ఇది Android 16 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వెనక కెమెరా వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంతేకాకుండా త్వరలోనే ఈ మొబైల్‌కి సంబంధించిన విడుదల తేది, ఫీచర్స్ అధికారకంగా ప్రకటించబోతోంది.
ఇక అదనంగా ఈ motorola edge 70 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ కెమెరాలు కూడా లభిస్తాయి. ఇక ఈ మొబైల్ ను కంపెనీ ఎంతో శక్తివంతమైన 4,800 mAh బ్యాటరీ 68 W వైర్డు చార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. మోటరోలా కంపెనీ గతంలో కాకుండా ఇప్పుడు టెక్నాలజీనిబట్టి కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది ఇటీవల కూడా భారత్‌లో మోటరోలా G67 పవర్ 5G స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీతో విడుదలైంది. అంతేకాకుండా ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇందులో ప్రత్యేకమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









