Daikin 3 Star AC: ఫ్లిఫ్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. Daikin ఏసీపై ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌.. అదనంగా రూ.3 వేల తగ్గింపు!

Daikin 2023 Model 1.5 Ton 3 Star Split Inverter AC Price Cut: అత్యంత తక్కువ ధరలోనే మంచి ఏసీ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? డైకిన్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC అత్యంత చీప్ ధరకే లభిస్తుంది. దీనిపై అదనంగా అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 29, 2025, 11:52 AM IST
Daikin 3 Star AC: ఫ్లిఫ్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. Daikin ఏసీపై ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌.. అదనంగా రూ.3 వేల తగ్గింపు!

Daikin 2023 Model 1.5 Ton 3 Star Split Inverter AC Price: గత రెండు నెలల నుంచి భారత్లో వేసిన కాలం ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత రోజుకు పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కొన్నిచోట్ల ఇప్పటికే 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. వేడి గాలుల కారణంగా వస్తున్న ఉక్కపోతను తట్టుకోలేక సాధారణ జనాలు కూడా ఏసీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది అతి తక్కువ ధరల్లో లభించే మంచి బ్రాండ్ కు సంబంధించిన ఏసీలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే ది బెస్ట్ టైంగా భావించవచ్చు.  

Add Zee News as a Preferred Source

ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ డైకిన్ 2023 సంవత్సరంలో విడుదల చేసిన అద్భుతమైన ఏసీని ఫ్లిఫ్‌కార్ట్‌ సమ్మర్ సేల్‌లో భాగంగా చీప్ ధరకే అందిస్తోంది. అంతేకాకుండా దీనిపై ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఏసి డైకిన్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ పేరుతో కంపెనీ విక్రయిస్తోంది. ఇక ఈ ఏసీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే, దీనిని కంపెనీ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ విద్యుత్ సామర్థ్యంతో అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఇన్వర్టర్ టెక్నాలజీను కూడా అందిస్తోంది. ఇందులో కంపెనీ 100 శాతం కాపర్ కండెన్సర్ కలిగి  ఉంటున్నట్లు తెలిపింది. ఇక ఇదే కాకుండా అన్ని దిశల్లో గాలిని అందించేందుకు ప్రత్యేకమైన 3D ఎయిర్‌ఫ్లో ఫీచర్ టీచర్స్ కూడా ఉన్నట్లు కంపెనీ క్లైమ్ చేసింది.

ఇక ఇందులో డైకిన్ ప్రత్యేకమైన ఫిల్టర్ సెటప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. PM 2.5 ఫిల్టర్ గాలిలోని దుమ్ము, ధూళి, ఇతర సూక్ష్మ కణాలను తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన గాలిని అందించేందుకు కొన్ని మోడళ్లలో టైటానియం అపటైట్ డీయోడరైజింగ్ ఫిల్టర్ (TAD) అందిస్తోంది. ఇవే కాకుండా గదిలో ఉండే దుర్వాసనను బయటికి తొలగించేందుకు కూడా ఈ ఫిల్టర్ కీలక పాత్ర పోషిస్తుంది..ఇక ఈ ఏసీలో ఎంతో ప్రత్యేకమైన డ్యూ క్లీన్ టెక్నాలజీ ప్రత్యేకమైన ఫీచర్ కూడా లభిస్తోంది.  ఇది ఆవిరి కండెన్సర్ కాయిల్‌ను స్వయంగా శుభ్రం చేయడమే కాకుండా.. బ్యాక్టీరియాను బూజును వృద్ధి చేయకుండా నిరోధిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ద్వారా స్వచ్ఛమైన గాలి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఏసీ ని ఇప్పుడే కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిప్కార్ట్ లో ప్రత్యేకమైన డీల్స్ లో భాగంగా లభిస్తోంది. 

ప్రస్తుతం మార్కెట్లో ఈ ఏసీ ధర రూ.58,499 కాగా.. సమ్మర్ సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ ఏకంగా దీనిపై 35 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ పోను రూ.37, 490కే దీనిని పొందవచ్చు. అలాగే అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ ను వినియోగించాలనుకునేవారు కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఏసీ పై ఉన్న అన్ని ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ ఏసీని బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.3,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.3,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను రూ.33, 490కే ఈ ఏసీని సొంతం చేసుకోవచ్చు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News