)
DND Promotional Call: మనలో చాలామంది ప్రస్తుతం కాలానికి అనుగుణంగా మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం. స్మార్ట్ ఫోన్ లేకుండా రోజు గడవదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా మన జీవితంలో భాగమైన ఫోన్ కు అప్పుడు అనవసరమైన కాల్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు ఏం చేసినా కంపెనీ లేదా బ్యాంకు కాల్స్ వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో మన మొబైల్‌పై చాలా విసుగు వస్తుంది. ఏదైనా అత్యవసర పనిమీద ఉన్నప్పుడు అనవసరమైన కాల్స్ రావడం మనలో చాలా మందికి ఎదురైన సంఘటనే. ఇలాంటి సందర్భాల్లో అంతుపట్టలేని కోపం వస్తుంది. ఆ కోపంతో కొందరు తమ ఫోన్లను పగలగొట్టేస్తారు. అయితే అలాంటి అనవసరమైన కాల్స్ రాకుండా మనం ముందు జాగ్రత్త పడొచ్చు. ప్రతిరోజూ మనకు వచ్చే ప్రమోషనల్, మార్కెటింగ్ కాల్స్ నుంచి బయట పడేందుకు ఓ ఉపాయం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1. డీఎన్డీని యాక్టివేట్ చేయాలి (Do not Disturb)
ప్రమోషనల్, మార్కెటింగ్ కు సంబంధించిన ఫోన్‌కాల్స్ రాకుండా ఉండాలంటే ముందు చేయాల్సిన పని ఇదే. మీ ఫోన్ నెంబర్‌పై ఉండే డునాట్ డిస్టర్బ్ (DND) అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీన్ని మూడు రకాలుగా యాక్టివేట్ చేయోచ్చు.
SMS ద్వారా..
START 0 అని టైప్ చేసి.. 1909కి సందేశాన్ని పంపాలి. అలా చేయడం వల్ల అన్ని ప్రమోషన్ కాల్స్ మొబైల్‌కు రావు. అయితే దీని వల్ల మనకు ఇంకో సమస్య ఉంది. ఇది యాక్టివేట్ చేయడం వల్ల బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల వివరాలు మెసేజ్‌లు రాకపోవచ్చు.
ట్రాయ్ డీఎన్డీ వెబ్సైట్ (TRAI)
ఇంటర్నెట్లో https://www.dndcheck.co.in/ సైట్‌కి వెళ్లి.. ‘నేషనల్ డునాట్ కాల్ రిజిస్టరీ’లో మన మొబైల్ నంబరు రిజిస్టర్ చేయించుకోవాలి. అలా చేయడం వల్ల అనవసరమైన కాల్స్ ఆపవచ్చు.
టెలికమ్ ప్రొవైడర్ ద్వారా..
మన దేశంలో ఉన్న టెలికామ్ సంస్థలన్నీటికి అధికారిక యాప్ ఉంటుంది. (ఉదాహరణకు ఎయిర్టెల్ థ్యాంక్స్, మై జియో, వీఐ యాప్). అందులో సెట్టింగ్స్‌లో డీఎన్డీ ఆప్షన్‌కు వెళ్లి ప్రిఫరెన్స్ ఎంపిక చేసి ప్రమోషనల్ కాల్స్ బ్లాక్ చేయోచ్చు.
2. మాన్యువల్ నంబర్ బ్లాకింగ్
డీఎన్డీ సెట్టింగ్స్‌ను యాక్టివేట్ చేసినా అనవసరమైన కాల్స్ చేస్తుంటే.. మన స్మార్ట్ ఫోన్లోని నంబర్ బ్లాకింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బ్లాక్ చేయోచ్చు.
3. నేరుగా బ్యాంక్‌కే సమాచారం
కొన్నిసార్లు బ్యాంకు నుంచి లోన్ ప్రాసెస్ చేసే టీమ్ కాల్స్ చేస్తూ విసిగిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో సదరు బ్యాంకుకు వెళ్లి తమ నంబరుపై ఉన్న డునాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. అలా వారికి సమాచారం ఇచ్చినట్లయితే మీకు ఆ బ్యాంకు నుంచి అనవసరమైన కాల్స్ రావు.
4. ట్రాయ్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా..
డీఎన్డీ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసినా కాల్స్ వస్తే.. నేరుగా 1909కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయోచ్చు. https://www.nccptrai.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చు.
5. అధికారిక వెబ్సైట్ ద్వారా..
బ్యాంక్ వెబ్సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి మీ కమ్యూనికేషన్ ప్రిఫరెన్స్ ను మార్చుకోవాలి. లేదంటే ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్కెటింగ్, ప్రమోషనల్ ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్, కాల్స్ ఆప్షన్స్‌ను ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల అనవసరమైన కాల్స్‌ను నిరోధించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook