Fire-boltt Gladiator New 2025 Model: ఛీప్‌ ధరకే ఫైర్-బోల్ట్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్స్‌, ధర లీక్!

Fire-boltt Gladiator New 2025 Model: మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 27, 2025, 11:52 AM IST
Fire-boltt Gladiator New 2025 Model: ఛీప్‌ ధరకే ఫైర్-బోల్ట్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్స్‌, ధర లీక్!

Fire-boltt Gladiator New 2025 Model: ప్రముఖ ఈ ఎలక్ట్రిక్‌ కంపెనీ ఫైర్-బోల్ట్ నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు గతంలో ఎన్నడు లేని అద్భుతమైన డిజైన్‌తో విడుదల కాబోతోంది. ఫైర్-బోల్ట్ కంపెనీ గ్లాడియేటర్ సిరీస్‌లోనే మరో ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయబోతోంది. అయితే ఈ సిరీస్‌ వాచ్‌ లాంచింగ్‌కి ముందే సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ స్మార్ట్‌వాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఈ కొత్త ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ స్మార్ట్‌వాచ్‌ చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 1.96 అంగుళాల పెద్ద HD డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ డిస్ల్పే 240×282 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో విడుదల కానుంది. అలాగే 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ వాచ్‌కి సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళితే.. ఇది అల్ట్రా- ఫ్రేమ్ డిజైన్ సెటప్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా ప్రీమియం స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీని కలిగి ఉంటుంది. 

ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ కొత్త సిరీస్‌ స్మార్ట్‌వాచ్‌ అనేక రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 24/7 హార్ట్‌ మానిటరింగ్‌ పర్యవేక్షణ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. అలాగే SpO2 ట్రాకింగ్‌ను కూడా అందిస్తోంది. అలాగే మహిళల ఆరోగ్యాన్ని మానిటరింగ్‌ చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ యాక్టివిటీ ట్రాకింగ్‌ కోసం కొన్ని అద్భుతమైన కొత్త ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఇందులో 123 స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన GPS మోడ్‌లును కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో అనేక రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌ లభిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తోంది. అలాగే బ్లూటూత్ కాలింగ్‌ను నాన్‌స్టాప్‌గా 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తోంది. ఇది మార్కెట్‌లోకి విడుదలైతే..ధర రూ.1,999 ఉండే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News