
Motorola G86 Power Big Billion Days Sale Offer: ఎర్లీ బిగ్ బిలియన్స్ డేస్ సేల్ ఈరోజు రాత్రి 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్‌ని కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తాయి. ముఖ్యంగా వాటిపై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అత్యంత తక్కువ ధరలోనే మోటరోలా మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఇవే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ఈ బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్స్‌పై ఏకంగా 40 నుంచి 50 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మోటరోలా కంపెనీ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన Motorola Moto G86 Power స్మార్ట్‌ఫోన్ Big Billion Days 2025లో భారీ డిస్కౌంట్‌తో లభించబోతోంది. దీనిని కంపెనీ అత్యద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఈ మొబైల్‌పై అందుబాటులోకి రాబోతున్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ G86 Power 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఆఫర్స్ వివరాళ్లోకి వెళ్తే.. మార్కెట్లో దీని ధర MRP రూ.19,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో 10 శాతం ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో కేవలం రూ.17,999కే అందుబాటులో ఉంది. అలాగే దీనిపైన ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక బిగ్ బిలియన్స్ డేస్‌లో భాగంగా ఈ Motorola Moto G86 Power మొబైల్‌ని కొనుగోలు చేసే వారికి కేవలం ధరగా రూ.15, 999కే లభించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే 5 నుంచి 7.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ మొబైల్ పై అదనంగా ఈ ఫెస్టివల్ సీజన్లో భాగంగా ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ బోనస్ ఆఫర్స్ లో భాగంగా పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ. 12 వేలకు పైగా బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ ను మొబైల్ ధర నుంచి తీసేస్తే.. రూ.3,999కే పొందవచ్చు.
ఇక ఈ Motorola Moto G86 Power స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. 6.67 అంగుళాల 1.5K pOLED ఫ్లాట్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 4500 nits పీక్ బ్రైట్నెస్ తో ఇది విడుదలైంది. ఇది ఎంతో శక్తివంతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను కూడా కలిగి ఉంటుంది. అలాగే SGS ఐ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి