Redmi A5 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్‌.. Redmi A5 మొబైల్‌పై రూ.5,330 బోనస్‌..

Redmi A5 Price: ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన రెడ్‌మీ ఏ5 (REDMI A5) స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌తో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 19, 2025, 01:05 PM IST
Redmi A5 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్‌.. Redmi A5 మొబైల్‌పై రూ.5,330 బోనస్‌..

Redmi A5 Price Cut: చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రెడ్‌మీ మార్కెట్‌లోకి మరో బడ్జెట్‌ ఫ్రెండ్లీ మొబైల్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ రెడ్‌మీ ఏ5 (REDMI A5) పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అతి తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం విశేషం..దీనిని కంపెనీ అద్భుతమైన 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో విడుదల చేసింది. దీని స్క్రీన్‌ 1640 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో రెండ్ మీ కంపెనీ ప్రత్యేకమైన ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీని కూడా అందిస్తోంది. దీనితో కళ్లకు ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఈ మొబైల్‌పై అనేక రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఇది ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఇక ఈ రెడ్‌మీ ఏ5 స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే.. ఇందులో 32MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో అందుబాటులోకి వచ్చింది. అదనంగా 8MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఫిల్మ్ ఫిల్టర్లు, ఫ్రేమ్స్ వంటి ప్రత్యేకమైన ఆప్షన్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్‌లో 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌లో కంపెనీ ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది  64GB స్టోరేజ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో కంపెనీ 2 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో పాటు 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తోంది.

ఈ మొబైల్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది 5200mAh బ్యాటరీ సెటప్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తోంది. ఇందులో రెడ్‌ మీ కంపెనీ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా తీసుకు వచ్చింది. ఇక డ్యూయల్ సిమ్ సపోర్ట్ (4G/5G డ్యూయల్ బ్యాండ్), 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ REDMI A5 మొబైల్‌ ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని ప్రిమయం వేరియంట్‌ 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధర MRP రూ.9,999 కాగా.. మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 25 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో కేవలం రూ.7,499కే పొందవచ్చు. 

ఇక ఈ REDMI A5 మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తుంది. పాత మొబైల్ ఎక్చేంజ్‌ చేసి, పేమెంట్‌ చేసేవారికి రూ.5,330 బోనస్‌ కూడా పొందవచ్చు. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ రూ. 2,169కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.     

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News