Google Pixel 10: వారెవా.. ఫోన్‌ అంటే ఇది మావా.. గూగుల్ నుంచి అద్భుతమైన మొబైల్‌!

Google Pixel 10 Price: త్వరలోనే మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 స్మార్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన బ్యాక్‌ కెమెరా సెటప్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 5, 2025, 06:19 PM IST
Google Pixel 10: వారెవా.. ఫోన్‌ అంటే ఇది మావా.. గూగుల్ నుంచి అద్భుతమైన మొబైల్‌!

Google Pixel 10 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ గూగుల్ తమ మరో పిక్సెల్ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. ఇది గతంలో విడుదల చేసిన పిక్సెల్ 9a మొబైల్‌కి చాలా అడ్వన్‌ ఫీచర్స్‌తో లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ పిక్సెల్ 10 సిరీస్‌ పేరుతో అందుబాటులోకి రాబోబోతోంది. ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ మొత్తం నాలుగు వేరియంట్స్‌లో విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది. అలాగే దీని బ్యాక్‌ సెటప్‌ చాలా ప్రీమియంగా ఉండబోతోంది. అయితే ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఈ గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అనేక ఫీచర్స్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. దీనిని కంపెనీ ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో గూగుల్ కంపెనీ ప్రత్యేకమైన కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇక ఇదిలా ఉంటే త్వరలోనే గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌ కూడా అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ ఈ ఏడాది 19 మార్చిన విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మార్చి 26 నుంచి దీని విక్రయాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.

Add Zee News as a Preferred Source

ఈ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాకముందే పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రావడం ఇప్పుడు అందరినీ అశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన డిస్ల్పేతో విడుదల కానుంది. అంతేకాకుండా 6.3-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ఎంతో శక్తివంతమైన టెన్సర్ G4 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.. 

ఈ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొదట 8GB ర్యామ్ సిరీస్‌లో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 15పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీని బ్యాక్‌ సెటప్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ 48MP ప్రధాన సెన్సార్ కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే అదనంగా 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని ఫ్రంట్‌ భాగంలో 13MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలను కూడా అందిస్తోంది. దీనికి గూగుల్ ఏడు సంవత్సరాల సిస్టమ్, భద్రతా సపోర్ట్‌ను కూడా అందించబోతున్నట్లు లీక్‌ అయిన వివరాల్లో పేర్కొన్నారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News