Google Pixel 8a: బడ్జెట్‌లో మంచి గూగుల్ మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన ఛాన్స్‌గా భావించవచ్చు. త్వరలోనే మార్కెట్‌లోకి రాబోయే Pixel 9a స్మార్ట్‌ఫోన్ దృష్టిలో పెట్టుకుని పాత మోడల్స్‌పై ధరలను తగ్గించి.. గతంలో విడుదలైన Pixel 8a స్మార్ట్‌ఫోన్ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులోకి ఉంది. దీనిపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై లభిస్తున్న ఆఫర్స్ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ పిక్సెల్ 8a ప్రాసెసర్
గూగుల్ పిక్సెల్ 8ఎ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం టెన్సర్ జి3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా ప్రత్యేక AI ఆధారిత గూగుల్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ చేసేవారికి చాలా బాగా పని చేస్తుంది. అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది.
ఇక ఈ మొబైల్ డిస్ల్పే OLED 6.1-అంగుళాలను కలిగి ఉంటుంది. దీని స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కూడా ఉంటుంది. ఇది స్క్రీన్‌కి రక్షణగా కూడా నిలుస్తుంది. ఇక దీని బ్యాటరీ 4,492mAh యూనిట్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
ఈ మొబైల్ కెమెరా ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీని బ్యాక్ సెటప్‌లో అతి శక్తివంతమైన 64MP ప్రధాన కెమెరా లభిస్తుంది. దీంతో పాటు 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరాను కూడా అందిస్తోంది. దీని కెమెరా దాదాపు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ భాగంలో 13MP కెమెరా కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేకమైన కెమెరా AI ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక గూగుల్ పిక్సెల్ 8a (Pixel 8a) అసలు ధర వివరాల్లోకి వెళితే.. ఇది రూ.52,999 కాగా ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోనూ.. రూ.15,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం రూ.37,999కే పొందవచ్చు. ఇక ఈ మొబైల్‌పై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
దీనిని ఇప్పుడే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి, EMI ఆప్షన్ చూస్ చేసుకుని కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.3,000 తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ పోనూ కేవలం రూ.34,999కే పొందవచ్చు. అలాగే PhonePe UPI ద్వారా పేమెంట్ చేసేవారికి రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏకంగా 5% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే అనదంగా ప్రత్యేకమైన ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









