Google Pixel 9A Vs Iphone 16E: గూగుల్ ఫోన్‌ కొనాలా..ఐఫోన్ కొనాలా? ఈ రెండింటిలో ది బెస్ట్‌ మొబైల్‌ ఇదే..

Google Pixel 9A Vs Iphone 16E: ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన గూగుల్ పిక్సెల్ 9a, ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌ మిడిల్ రేంజ్‌ బడ్జెట్‌లో లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్స్‌లో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకోండి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 21, 2025, 03:30 PM IST
Google Pixel 9A Vs Iphone 16E: గూగుల్ ఫోన్‌ కొనాలా..ఐఫోన్ కొనాలా? ఈ రెండింటిలో ది బెస్ట్‌ మొబైల్‌ ఇదే..

Google Pixel 9A Vs Iphone 16E: మిడిల్‌ రేంజ్‌లో గూగుల్, యాపిల్‌ కంపెనీల నుంచి తాజాగా మంచి స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో గూగుల్ పిక్సెల్ 9a, యాపిల్ ఐఫోన్ 16e కొత్తగా విడుదలయ్యాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ మధ్య మార్కెట్‌లో మంచి పోటీ నడుస్తోంది. గూగుల్ ఇటీవలే విడుదల చేసిన పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌ 48-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా యాపిల్ కూడా సేమ్‌ మెగాపిక్సెల్‌తో విడుదలైంది. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ఈ ఐఫోన్ 16e,  పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిస్ల్పే ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ గూగుల్ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన 6.3-అంగుళాల Actua pOLED స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 1,080 x 2,424 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ 60–120 Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌ను కూడా అందిస్తోంది. ఇక ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు స్క్రీన్‌కి ప్రత్యేకమైన సిరామిక్ షీల్డ్ ప్రొక్షన్‌ను కూడా అందిస్తోంది. 

ప్రాసెసర్‌ వివరాలు:
గూగుల్ స్మార్ట్‌ఫోన్‌ Tensor G4 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది టైటాన్ M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్‌తో అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8 GB ర్యామ్‌తో పాటు ఎంతో శక్తివంతమైన Android 15తో విడుదల కాబోతోంది. దీనికి కంపెనీ ఏడు సంవత్సరాల పాటు OS సెక్యూరిటీని అందిస్తోంది. ఇక ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ప్రత్యేకమైన A18 చిప్  అందిస్తోంది. అలాగే స్పెషల్ iOS 18 OSను కూడా అందిస్తోంది. దీనితో పోలిస్తే.. Tensor G4 ప్రాసెసర్‌ 80% వేగంగా ఉంటుందని సమాచారం.

కెమెరా సెటప్‌:
గూగుల్ పిక్సెల్ 9aలో కంపెనీ అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు రెండు 48MP ప్రైమరీ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌లో కూడా 48MP ఫ్యూజన్ సింగిల్ కెమెరా కెమెరా ఉంటుంది. ఇది కేవలం సింగిల్‌ కెమెరా సెటప్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే గూగుల్ మొబైల్‌లో ప్రత్యేకమైన AI ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు ఫ్రంట్‌ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఛార్జింగ్, బ్యాటరీ:
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 5,100mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 30 గంటల బ్యాకప్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన 7.5W వైర్‌లెస్, 23W కేబుల్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐఫోన్ 16e తో బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇందులో కంపెనీ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్లు సమాచారం.. 

ఈ గూగుల్ పిక్సెల్ 9ఎ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది  రూ.49,999తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఐఫోన్ 16ఇ మొబైల్‌ ధర రూ.59,999తో లభిస్తోంది. ఈ రెండు మొబైల్స్‌ అన్నింటి పరంగా పోల్చి చూస్తే, ఈ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన AI-ఆధారిత కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కెమెరా పరంగా మంచి స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునేవారు గూగుల్ పిక్సెల్ 9ఎ బెస్ట్‌గా భావించవచ్చు. ఫీచర్స్‌ పరంగా కూడా గూగుల్ మొబైల్‌ చాలా బెస్ట్‌ అని చెప్పొచ్చు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News