Google Pixel 9A Price: గూగుల్ కంపెనీ తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ Google Pixel 9A పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌తో విడుదలైంది. ఈ పిక్సెల్ క్లీన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో విడుదలైంది. ముఖ్యంగా ఈ మొబైల్ ప్రత్యేకమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిని కంపెనీ గతంలో విడుదల చేసిన పిక్సెల్ 8ఏ మొబైల్‌కి సక్సెసర్‌గా విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక ఈ పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ డిజైన్ , డిస్ప్లే వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది మ్యాట్ ఫినిష్‌తో కూడిన ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శాటిన్ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో IP68 డస్ట్‌తో పాటు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఇందులో కంపెనీ 6.3-అంగుళాల యాక్చువా డిస్ప్లేను అందిస్తోంది. దీంతో పాటు 1080 x 2424 పిక్సెల్‌లు FHD+ రిజల్యూషన్‌ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.
పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ 60-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ డిస్ల్పే HDRకు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే గరిష్టంగా 2700 నిట్స్ బ్రైట్నెస్ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ డిస్ల్పే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌తో విడుదల కానుంది. దీనిని కంపెనీ టెన్సర్ జి4 చిప్‌సెట్‌పై రన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది కేవలం 8GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో విడుదలైంది.
ఇక ఈ పిక్సెల్ 9ఏ మొబైల్‌కి సంబంధించిన బ్యాక్ కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే..ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని ప్రధాన కెమెరా 48MP ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అదనంగా 13MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులోని ఫ్రంట్ కెమెరా 13MPని కలిగి ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ప్రత్యేకమైన AI ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.
దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే భారీ తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో రూ.49,999 కాగా..HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.3 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.46,999కే పొందవచ్చు. దీనిని ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.15,819కే పొందవచ్చు. పాత మొబైల్ ఎక్చేంజ్ చేసేవారికి రూ.34,180 వరకు బోనస్ లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook