Google Pixel 9a Price: 48MP కెమెరాతో Google Pixel 9a మొబైల్‌ లాంచ్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌.. పూర్తి వివరాలు ఇవే!

Google Pixel 9a Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ గూగుల్ తమ కొత్త మొబైల్ పిక్సెల్ 9aను విడుదల చేయబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 21, 2025, 12:31 PM IST
Google Pixel 9a Price: 48MP కెమెరాతో Google Pixel 9a మొబైల్‌ లాంచ్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌.. పూర్తి వివరాలు ఇవే!

Google Pixel 9a Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ గూగుల్ మార్కెట్‌లోకి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన కెమెరాతో లాంచ్‌ కాబోతోంది. అయితే ఈ మొబైల్‌ను కంపెనీ గతంలో విడుదల చేసిన 8a స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ కంపెనీ దీనినిన పిక్సెల్ 9a పేరుతో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ విడుదలకు ముందే లీక్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

త్వరలో విడుదల కాబోయే పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మొబైల్‌కి సంబంధించిన విడుదల తేది వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్చి నెలలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు అధికారిక సమాచారం.. అయితే కంపెనీ దీనిని ధర రూ.42,000లోపే అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో విడుదల కాబోతోంది. ఇందులో మొదటి వేరియంట్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్, రెండవది 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది.

ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్‌ వివరాల్లోకి వెళితే.. గతంలో విడుదల చేసిన డిజైన్స్‌కి ఆప్డేట్‌ వెర్షన్‌లో దీని డిజైన్‌ ఉంటుంది. దీని డిస్ల్పే 6.3-అంగుళాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో లాంచ్‌ కానుంది. అలాగే దీని డిస్ల్పే ప్రీమియంగా కనిపించేందుకు ప్రత్యేకమైన డిస్ల్పే ఆప్షన్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది టెన్సర్ G4 చిప్‌సెట్‌తో పాటు ఆండ్రాయిడ్ 15తో లాంచ్‌ కానుంది. దీని బేస్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో వస్తున్నట్లు లీక్‌ అయిన వివరాల్లో పేర్కొన్నారు.

Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో

గూగుల్ పిక్సెల్ మొబైల్స్‌ అద్బుతమైన కెమెరా సెటప్‌లను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ కెమెరాలకు చాలా ప్రసిద్ధి.. దీనిని ఇలాగే కొనసాగించేందుకు ఈ  పిక్సెల్ 9aలో కూడా అద్భుతమైన కెమెరాను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో 48MP ప్రధాన కెమెరాతో పాటు  13MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుందని లీక్‌ అయిన వివరాల్లో వెల్లడించారు. అంతేకాకుండా ఫ్రంట్‌ భాగంలో 13MP ప్రీమియం కెమెరా ఉంటుంది. అలాగే మొట్టమొదటి సారిగా ఎంట్రీ లెవల్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌లో AI ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఇందులో కంపెనీ 5,100mAh బ్యాటరీని అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే అతి త్వరలోనే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ఇతర వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించే ఛాన్స్‌ ఉంది. 

Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News