Hero Spender EV: హీరో స్పెండర్‌ ఎలక్ట్రిక్ బైక్ 2025 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధర పూర్తి వివరాలు ఇవే!

Hero Spender Electric Bike: హీరో నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్ స్పెండర్‌ మోటర్‌సైకిల్‌ ప్రారంభం కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 25, 2025, 03:47 PM IST
Hero Spender EV: హీరో స్పెండర్‌ ఎలక్ట్రిక్ బైక్ 2025 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధర పూర్తి వివరాలు ఇవే!

Hero Spender Electric Bike Bike: చాలా మంది పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్‌ బైక్‌లకు బదులుగా ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందుకే మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్లు, మోటర్‌సైకిల్స్‌ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. అలాగే ఇందులో కూడా చాలా మంది అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన మోటర్‌సైకిల్స్‌, కార్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా ఎప్పటి నుంచో మంచి మోటర్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం త్వరలోనే ప్రముఖ మోటర్‌సైకిల్‌ కంపెనీ తయారీ కంపెనీ హీరో (Hero) గుడ్‌న్యూస్‌ తెలపబోతోంది. త్వరలో విడుదల కాబోయే హీరో కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

Add Zee News as a Preferred Source

హీరో ఎలక్ట్రిక్ బైక్ స్పెండర్‌ (Hero Spender Electric Bike) డిజైన్‌లో విడుదల కానుంది. అంతేకాకుండా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. హీరో స్పెండర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే బాడీ ఫినిషింగ్‌లో భాగంగా దీనికి హీరో కంపెనీ ప్రత్యేకమైన గ్రాఫిక్స్ స్టిక్కర్స్‌ను అందిస్తోంది. అలాగే ఫ్రంట్‌ భాగంలో ప్రీమియం లైట్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది. ప్రత్యేకమైన ఎంటిగేటర్‌ లైట్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని వల్ల రాత్రి పూట కూడా రోడ్డు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.

హీరో (Hero Spender Ev)ఎలక్ట్రిక్ బైక్‌ ఎంతో శక్తివంతమైన ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన మైలేజీతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గత మోడల్‌ ఇంజన్‌ కంటే నాయిస్‌ లెస్‌తో విడుదల కానుంది. అలాగే రైడర్‌ అద్భుతమైన అనుభూతిని పొందేందుకు ప్రత్యేకమైన సీటింగ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు స్పెషల్ బ్రెకింగ్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుందని సోషల్‌ మీడియాలో లీక్‌ అయిన ఫీచర్స్‌ ద్వారా తెలుస్తోంది. అలాగే ప్రత్యేక లుక్‌ను కలిగి ఉంటుంది. 

హీరో ఎలక్ట్రిక్ బైక్ (Hero Spender Electric Bike) స్పెండర్‌ బ్యాటరీ చాలా అద్భుతమైన సామర్థ్యంతో వస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 90 నుంచి 105 కిలో మీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా దీనిని పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి దాదాపు 4 గంటల పాటు సమయం పడుతుంది. అలాగే ఈ బ్యాటరీ చార్జింగ్ చేసేందుకు ప్రత్యేకమైన సాకెట్‌ను కూడా అందిస్తోంది. ఇక దీని ధర రూ.85 వేల నుంచి ప్రారంభమవుతుంది. అయితే హీరో కంపెనీ ఈ మోటర్‌సైకిల్‌ను వచ్చే ఏడాది 2026 మొదటి నెల లేదా రెండవ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News