Hero Vida Z V2 Launch Date In India: ప్రముఖ హీరో మోటర్‌సైకిల్ కంపెనీ మార్కెట్‌లో త్వరలోనే కొత్త స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం లుక్‌తో పాటు అద్భుతమైన కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. ఇటీవలే ఇటలీలో జరిగిన EICMA 2024 మోటార్ షోలో కూడా కంపెనీ ప్రపంచానికి పరిచయం చేసింది. విడా జెడ్ విడుదల చేసిన డిజైన్‌లోనే ఈ విడా వి2 స్కూటర్‌ను కూడా లాంచ్ చేయబోతంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించిన టెస్టింగ్ కూడా ప్రారంభించారు. ఇటీవలే కొన్ని చోట్ల టెస్టింగ్ సమయాల్లో రోడ్లపై కూడా కనిపించింది. ఈ స్కూటర్‌ను కంపెనీ మొదట ఎల్లో కలర్‌లో విడుదల చేయబోతున్నారు.
విడా వి2 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ LED హెడ్‌ల్యాంప్‌తో పాటు LED టెయిల్ ల్యాంప్ సిగ్నేచర్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌తో కూడిన LED టర్న్ ఇండికేటర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ స్కూటర్‌లో కంపెనీ ప్రత్యేకించి.. డ్యూయల్-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సిస్టమ్‌తో పాటు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కూడా అందిచబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అప్డేటెడ్ టెయిల్ లాంప్స్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన సీటింగ్‌ను కూడా అందిస్తోంది.
ఈ విడా వి2 ఎలక్ట్రిక్ స్కూటర్ వివిధ రకాల మోడల్స్‌లో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బ్యాటరీ సెటప్‌లలో విడుదల కాబోతోంది. ఈ V2 లైట్ స్కూటర్ 2.2 kWh బ్యాటరీని కలిగి ఉంటే, V2 ప్లస్ 3.44 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్స్ 94 Km రేంజ్ మైలేజీని అందిస్తాయి. అంతేకాకుండా హైఎండ్ స్కూటర్ 143 Km మైలేజీ రేంజ్‌ను అందించే అవకాశాలు ఉన్నాయని కంపెనీ క్లైమ్ చేస్తోంది. ఇక V2 ప్రో స్కూటర్ ఎంతో శక్తివంతమైన 3.94 kWh బ్యాటరీతో విడుదల కానుంది. అంతేకాకుండా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 165 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది.
ఇక ఈ V2 లైట్ గరిష్టం వేగం వివరాల్లోకి వెళితే ఇది.. గంటకు 69 కిలోమీటర్ల వరకు వేగం వెళ్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే V2 ప్లస్ గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గమస్థానానికి చేర్చుతుంది. ఇక ప్రో వేరియంట్ వివరాల్లో వెళితే.. ఇది గంటకు 90 కి.మీ వరకు గరిష్ట వేగంతో దూసుకుపోనుంది. ఈ స్కూటర్‌లో ప్రత్యేకమేంటంటే ప్రత్యేకమైన LED లైట్లు కలిగి ఉండడం. ఇందులో కంపెనీ TFT టచ్‌స్క్రీన్ డిస్ప్లేను కూడా అందిస్తోంది. దీంతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో పాటు కీలెస్ ఆపరేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ప్రో వేరియంట్‌లో మాత్రం ఇతర ప్రత్యేకమైన ఫీచర్స్ ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









