Honda Jazz: దిమ్మతిరిగే ఫీచర్స్‌తో Honda Jazz 2025 కారు రాబోతోంది.. పూర్తి వివరాలు ఇవే..

Honda Jazz Launch Date: అతి త్వరలోనే హోండా కంపెనీ తమ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రానున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 23, 2025, 10:40 AM IST
Honda Jazz: దిమ్మతిరిగే ఫీచర్స్‌తో Honda Jazz 2025 కారు రాబోతోంది.. పూర్తి వివరాలు ఇవే..

Honda Jazz Launch Date: ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చే కార్లను జనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా టాటా, మహింద్రా కంపెనీలు విడుదల చేసే కార్లను ఎక్కుగా కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ప్రత్యేకమైన ఫీచర్స్‌తో కూడిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కార్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ప్రముఖ హోండా కంపెనీ కూడా తమ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. హోండా జాజ్ అనే పేరుతో ఇది విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

హోండా జాజ్ (Honda Jazz) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారును మొదటగా చైనాలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తంది. ఆ తర్వాత భారత్‌లో అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఈ కారు ఫ్రంట్ ప్రొఫైల్ చాలా బోల్డ్‌గా ఉండబోతోంది. అలాగే ప్రీమియం హెడ్‌లైట్లతో పాటు ప్రత్యేకమైన బంపర్స్‌ను కూడా కలిగి ఉంటుందని సమాచారం.. ఇందులోని ప్రత్యేకమైన డ్యూయల్-టోన్ ORVMన్లతో పాటు వెనక భాగంలో 'రేసింగ్ డిఫ్యూజర్' లాంటి ప్లాస్టిక్ యాడ్-ఆన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు స్పెషల్ టెయిల్‌ లైట్స్‌ను కూడా అందిస్తోంది. 

ఇక ఈ (Honda Jazz) కారులో ఇంటీరియర్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రత్యేకమైన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తోంది. అలాగే స్పెషల్‌గా డిజిటల్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉండబోతోంది. దీంతో పాటు కారులో వెనక కూర్చునే వారికి కూడా ప్రత్యేకమైన AC వెంట్స్‌ను అందిస్తోంది. ఈ కారు లోపలి భాగంలో ప్రీమియం డ్యూయల్-టోన్ లెదర్ ఫినిషింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్‌ను కూడా లభిస్తోంది. దీంతో పాటు ఇన్‌బిల్ట్ నావిగేషన్‌ను కూడా అందిస్తోంది. 

ఈ హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును కంపెనీ 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అలాగే ఈ ఇంజన్‌ 120 bhpతో పాటు 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కంపెనీ VT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ప్రీమియం డ్రైవ్‌ అనుభూతి కోసం ప్రత్యేకమైన ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ గతంలోనే ఈ కారు భారత్‌లో విడుదల చేయాలనుకుంది.. అయితే ఈ కారు పొడవు దాదాపు 4.2 మీటర్ల పొడవు ఉండడం వల్ల అధిక పన్ను భారం పడుతుందని విడుదలను నిలిపివేసింది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News