
Honor Play 60 And Honor Play 60m Price: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ హానర్ ప్లే 60, హానర్ ప్లే 60m పేర్లతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే ఈ మొబైల్స్ అద్భుతమైన కెమెరాతో పాటు ప్రీమియం డిస్ల్పే సెటప్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌తో చూడడానికి ఆకర్శనీయంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు:
హానర్ ప్లే 60 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది 60m లు మీడియాటెక్‌కు సంబంధించిన డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఆక్టా-కోర్ CPUతో పాటు ARM G57 MC2 GPUను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత శక్తివంతమైన డిస్ల్పే సెటప్‌తో విడుదల కాబోతోంది. ఇది 6.61-అంగుళాల TFT LCD డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని స్క్రీన్ 1604×720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో లభించబోతోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 ఆధారిత MagicOS 15 పై నడుస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ హానర్ ప్లే 60 స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. దీని వెనుక భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది 13-మెగాపిక్సెల్ సింగిల్ ప్రధాన కెమెరా కెమెరాతో విడుదల కానుంది. ఇది 10x డిజిటల్ జూమ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇక దీని ఫ్రంట్ భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరా కూడా లభిస్తుంది. ఈ కెమెరా దాదాపు 1080 పిక్సెల్స్ వరకు రికార్డింగ్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో అదనంగా డ్యూయల్-వ్యూ వీడియో సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో శక్తివంతమైన బ్యాటరీ సపోర్ట్‌ను అందిస్తోంది. రెండు ఫోన్లు 6000mAh బ్యాటరీని కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇక కంపెనీ దీనిని మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో విడుదల చేసింది. ఇందులోని బేస్ వేరియంట్ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో వచ్చింది. ఇక సెకండ్ వేరియంట్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇక హైఎండ్ వేరియంట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో విడుదలైంది. దీని ధర రూ.14,000 నుంచి ప్రారంభమవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook