)
Huawei Mate 80 Series Launch Telugu News: ప్రముఖ చైనీస్ కంపెనీ హువావే మార్కెట్లోకి ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు మోస్ట్ ప్రీమియం డిజైన్‌తో లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ హువావే మేట్ X7 ఫోల్డబుల్ పేరుతో విడుదల చేసింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మేట్ 80, మేట్ 80 ప్రోతో పాటు మేట్ 80 ప్రో మాక్స్‌లను కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన మెరుగైన XMAGE ఇమేజింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్స్ చాలా స్పెషల్ LTPO OLED డిస్ప్లేలతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఈ మొబైల్స్‌కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హువావే మేట్ 80 సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది చాలా అద్భుతమైన 6.75-అంగుళాల OLED డిస్ల్పే ప్యానెల్‌తో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా 1–120Hz LTPO అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని స్క్రీన్ 2832 × 1280 FHD+ రిజల్యూషన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన Kirin 9020 ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో అద్భుతమైన HarmonyOS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
ఇక దీని బ్యాక్ సెటప్‌లో 50MP అల్ట్రా లైటింగ్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 40MP అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ఫ్రంట్ భాగంలో 13MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన 3D డెప్త్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 5750mAh బ్యాటరీతో పాటు 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ సెటప్‌తో లాంచ్ అయ్యింది..
హువావే మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. డిస్ల్పేతో పాటు ఇతర ఫీచర్స్ మేట్ 80 ఫీచర్స్ లాగానే ఉంటాయి. కానీ ఈ మేట్ 80 ప్రోలో ప్రత్యేకంగా హార్మొనీ OS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అలాగే ఇందులోని కెమెరా అల్ట్రావైడ్ రియర్ సపోర్ట్‌తో భిస్తోంది. దీంతో పాటు అదనంగా OISతో మెరుగైన 48MP మాక్రో టెలిఫోటో లెన్స్ కూడా లభిస్తోంది. ఈ కెమెరా దాదాపు 100x డిజిటల్ జూమ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన 100W వైర్డు సూపర్ఛార్జ్ సపోర్ట్‌తో పాటు 80W వైర్లెస్ సూపర్ఛార్జ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇక హువావే మేట్ 80 ప్రో మాక్స్‌లో ఈ మోడల్ లాగే ఫీచర్స్ ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ లభిస్తాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్ కంపెనీ కేవలం చైనాలో మాత్రమే విడుదల చేసింది. అతి త్వరలోనే భారత మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి