ibomma Telugu: ఐబొమ్మ నుంచి బిగ్‌ అప్డేట్.. ఇక నుంచి సినిమాలు చూడొద్దు!

ibomma Telugu Clarity: ఐబొమ్మ(Ibomma) వెబ్‌సైట్‌లో సినిమాలు చూసేవారికి బిగ్‌ అప్డేట్..ఐ బొమ్మ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఐబొమ్మ ఇచ్చిన క్లారిటీ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 3, 2025, 11:17 PM IST
ibomma Telugu: ఐబొమ్మ నుంచి బిగ్‌ అప్డేట్.. ఇక నుంచి సినిమాలు చూడొద్దు!

ibomma Telugu Clarity: ప్రస్తుతం చాలా మంది తమ అభిమాన హీరోలకు సంబంధించిన సినిమాలను మాత్రమే థియేటర్స్‌కి వెళ్లి చూస్తున్నారు. ఇతర సినిమాలు ఇంట్లోనే OTTల్లో చూస్తున్నారు. మరికొంతమందైతే టీవీల్లో కాకుండా స్మార్ట్‌ఫోన్స్‌లో చూస్తున్నారు. ముఖ్యంగా కొంతమందైతే.. ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెరగడంతో ఫ్రీగా చూసేందుకే ఇష్టపడుతున్నారు. దీని కారణంగా చాలా మంది థార్డ్‌ పార్టీ మూవీ స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఐబొమ్మతో పాటు మూవీ రూల్స్‌ వంటి వెబ్‌సైట్స్‌లో కొత్త సినిమాలు చూస్తున్నారు. అయితే ఇలాంటి వెబ్‌సైట్స్‌లో సినిమాలు చూడడం చాలా ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొంతమంది రోజు చూస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా ఐబొమ్మ(Ibomma) వెబ్‌సైట్‌లోనైతే నిత్యం లక్షలాది మంది సినిమాలు చూస్తున్నారు.  కొత్త, పాత తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉచితంగా స్ట్రిమ్‌ చేసే ఈ వెబ్‌సైట్‌ చాలా ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొంతమంది ఏ మాత్రం తగ్గకుండా మూవీస్‌ చూస్తున్నారు. అయితే ఈ ఐబొమ్మకు క్రేజ్‌ విపరీతంగా పెరగడం వల్ల ఇలాంటి వెబ్‌సైట్స్‌ గూగుల్‌లో చాలా పుట్టుకు వచ్చాయి. ఈ సైట్స్‌ ఐబొమ్మ కంటే ప్రమాదంగా మారాయి. ఇప్పటికే దీనిపై మన తెలుగు దర్శకులు, నిర్మాతలు ఎన్నో సార్లు కంప్లెయింట్‌ చేసినప్పటికీ ఏ మాత్రం ఫలితం లేకపోయింది. కొన్ని రోజుల పాటు సినిమాలు అప్లోడ్‌ చేయడం మానేసి..ఉన్నట్లుండి డొమాన్స్‌ మార్చడం వంటి పనులు చేసి మళ్లీ కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌ చేసింది. ఇలా చాలా సార్లు జరిగింది.

కొన్ని రోజులు గూగుల్‌లో ఐబొమ్మ నుంచి ఐబొమ్మ వన్‌గా పేరు మార్చుకుని కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌ చేస్తూ వచ్చింది. ఇలా ఐబొమ్మ చాలా పేర్లతో కొత్త మూవీస్‌ను స్ట్రిమింగ్‌ చేస్తూ వచ్చింది. తాజా బప్పం(Bappam Tv) టీవీ పేరుతో కొత్త సినిమాలను అప్టోడ్ చేస్తోంది. నిజానికి ఇలా పేర్లు మార్చిన అన్ని సైట్లు ఇప్పటికీ ఓపేన్‌ అవుతున్నాయి. అయితే టెక్‌ నిపుణులు అవి చాలా ప్రమాదకరమైన సైట్లని.. వాటిల్లో స్ట్రిమ్‌ అయ్యే సినిమాలు చూడడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఐబొమ్మ వన్‌ పేరుతో కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌ చేస్తున్న వెబ్‌సైట్‌లో చూడడం అస్సలు మంచిది కాదని వారంటున్నారు.

తాజా బప్పం టీవీ (Bappam Tv) (పూర్వ ఐబొమ్మ) తన యూజర్స్‌కి ఓ పెద్ద క్లారిటీని ఇచ్చింది. ఐబొమ్మ వన్‌(Ibomma)లో స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమాలు చూస్తున్నవారిపై సైబర్‌ ఎటాక్‌ జరిగే అవకాశాలు ఉన్నాయని.. అందులో మూవీస్‌ చూడడం మంచిదికాదని, అదోక ఫేక్‌ వెబ్‌సైట్‌ అని ప్రతి సినిమాకు ముందు నోటిఫికేషన్‌ బ్యానర్‌ వేస్తోంది. అలాగే దీని పేరుతో ప్రత్యేకమై APK మోడ్‌ ఫైల్స్‌తో కూడిన యాప్స్‌ కూడా వచ్చాయి. ఇలాంటి యాప్స్‌ కూడా డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం మంచిదని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. ఒక వేళ వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల ఫోన్‌ మొత్తం హాక్‌ అయ్యే ఛాన్సులు ఉన్నాయని వారంటున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News