ISRO: 2026లో ఇస్రో తొలి పీఎస్‌ఎల్వీ-సీ62 ప్రయోగం విఫలం.. 16 ఉపగ్రహాలు అదృశ్యం

PSLV-C62: ఇస్రో 2026 స్పేస్ క్యాలెండర్​లో తొలి ప్రయోగం చేపట్టింది. ఈరోజు, జనవరి 12న చేపట్టిన PSLV-C62 రాకెట్‌లో “EOS-N1” ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందిన 15 ఇతర ఉపగ్రహాలను ప్రయోగించింది. ఉదయం 10 గంటల 17 నిమిషాల 30 సెకన్లకు శ్రీహరికోట నుంచి “PSLV-C62” నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఈ అంతరిక్ష ప్రయోగం విఫలమైంది.

Written by - Aruna Maharaju | Last Updated : Jan 12, 2026, 12:23 PM IST
ISRO: 2026లో ఇస్రో తొలి పీఎస్‌ఎల్వీ-సీ62 ప్రయోగం విఫలం.. 16 ఉపగ్రహాలు అదృశ్యం

PSLV C62 Launch Anomaly Fourth Stage Isro Analysis: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) 2026లో చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. పీఎస్ఎల్వీ సీ 62 రాకెట్ ద్వారా రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘అన్వేష’ లేదా ‘ఈఓఎస్‌-ఎన్‌1’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, మూడో దశ వరకు సజావుగా సాగిన రాకెట్ ప్రయోగం.. నాలుగో దశ ప్రారంభంలోనే ఉపగ్రహాంతో సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. 18 నిమిషాలకే పూర్తికావాల్సిన ప్రయోగం సాంకేతిక సమస్య కారణంగా పూర్తికాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ప్రయోగంపై ఉత్కంఠ నెలకొంది.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో ప్రయోగం పురోగతిపై ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. మూడో దశ విజయవంతంగా కంప్లీట్ అయిందని.. కానీ, నాలుగో దశలో సాంకేతిక సమస్య ఏర్పడిందన్నారు. సాంకేతిక లోపంపై డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. అయితే ఈ ప్రయోగం ద్వారా థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్‌‌ సహా పలు దేశాలకు చెందిన 14 చిన్న ఉపగ్రహాలు ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు.

24 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం సరిగ్గా 10.15 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈఓఎస్-ఎన్ 1తో పాటు మరో 14 ఉపగ్రహాలను తీసుకుని పీఎస్ఎల్వీ సీ 62 రాకెట్ బయలుదేరింది. మొదటి మూడు దశలు సక్రమంగా సాగడంతో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలు చేరుకుంటాయని అంతా భావించారు. కానీ, మూడో దశ చివరలో అనూహ్యంగా సాంకేతిక సమస్య తలెత్తింది.

భారత్ ప్రైవేట్ రంగంలో పూర్తిస్థాయి 9వ వాణిజ్య మిషన్ ఇది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ మిషన్‌ కోసం ప్రధాన ఉపగ్రహం ఈఓఎస్‌-ఎన్‌12ను రూపొందించింది. ప్రత్యేకంగా రక్షణ, పరిశోధన, అభివృద్ధి కోసం తయారుచేసిన ఈ హైపర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం.. సరిహద్దుల పర్యవేక్షణతో పాటు వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావించారు. ప్రయోగం విజయవంతమైతే సరిహద్దుల్లో ఉగ్రవాదుల గురించి కదిలికలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉండేది. సాధారణ కెమెరాలు కేవలం రంగులను మాత్రమే గుర్తించగలవు. కానీ అన్వేష ఉపగ్రహం మాత్రం.. కాంతిని వందలాది అతి సూక్ష్మ తరంగాలుగా విడదీసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల భూమిపై ఉన్న వస్తువు దేనితో తయారైందో స్పష్టంగా తెలిసిపోతుంది.

Also Read: Pranam Day Care Centres: తెలంగాణలో వృద్ధుల కోసం ‘ప్రణామ్’ పేరిట డే కేర్‌ సెంటర్లు.. ఎలా పనిచేస్తాయంటే..?

Also Read: MSVP: 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకి చిరంజీవి, వెంకటేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News