)
Honor Power 2 Specifications Leak: అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో కూడిన మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మరికొన్ని రోజులపాటు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అతి త్వరలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ నుంచి అద్భుతమైన శక్తివంతమైన బ్యాటరీతో కూడిన మొబైల్ విడుదల కాబోతోంది. ఇది 10,000 mAh జంబో బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. దీనిని హానర్ కంపెనీ హానర్ పవర్ 2 పేరుతో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదలయితే బ్యాటరీ కింగ్‌గా పేరుపొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, విడుదలకు ముందే ఈ మొబైల్‌కు సంబంధించిన అనేక ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
హానర్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండడమే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్ని కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మొబైల్‌ను కంపెనీ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 SoC ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీంతోపాటు 66 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లతో ఈ మొబైల్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హానర్ పవర్ 2 స్మార్ట్‌ఫోన్ సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ 2026 సంవత్సరం మొదటి నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదల చేసిన హానర్ పవర్‌కి సక్సెసర్‌గా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక హానర్ పవర్ టూ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా 2026 సంవత్సరంలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ప్రత్యేకమైన 6.78-అంగుళాల 120 Hz LTPS ఫ్లాట్ డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 4,500 నిట్ల గరిష్ట బ్రైట్నెస్ సపోర్టుతో లభిస్తోంది. దీంతోపాటు IP68/IP69 రేటింగ్లను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డ్రాప్-రెసిస్టెంట్ బాడీతో విడుదల కాబోతోంది. దీనికి ప్రత్యేకమైన ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్‌కు 10,000 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం కంపెనీ ఇందులో 66 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook