Lava Agni 3 5G Price Cut: డ్యూయల్ డిస్ప్లే మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. క్రమంగా వీటి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అత్యంత తగ్గింపు ధరకే ప్రీమియం ఫీచర్స్‌తో లభించే డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్స్‌ను చాలా మంది ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే Lava కంపెనీ కూడా మార్కెట్‌లోకి Agni 3 5G మోడల్ డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది. అయితే ఈ మొబైల్ ఇప్పుడు అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. దీనిపై ఉన్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ లావా అగ్ని 3 (Lava Agni 3 5G) స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అయితే దీనిపై అదనంగా అనేక రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.4000 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైన డ్యూయల్ స్క్రీన్ ఆప్షన్ కూడా లభిస్తోంది. దీంతో పాటు ఇందులో డిస్ల్పే ప్రత్యేకమైన సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది స్పెషల్ 8GB ర్యామ్‌తో పాటు 16GB ర్యామ్ సిరీస్‌లో విడుదలైంది. అలాగే ఇందులో యాపిల్ 16 సిరీస్ లాగే ప్రత్యేకమైన యాక్షన్ బటన్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా బోలెడు ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. మొదటి వేరియంట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ధర రూ.20,998 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.4000 కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఆఫర్స్ అన్ని పోనూ.. ధర రూ.16,998కే లభిస్తోంది. ఇక ఇవే కాకుండా అదనంగా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీనిని కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అదనంగా రూ.12000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కకూడా లభిస్తోంది. దీంతో ఈ ఆఫర్స్ అన్ని పోనూ.. రూ.2 వేలకే ఈ కొత్త మొబైల్ పొందవచ్చు.
లావా అగ్ని 3 5G ఫీచర్లు:
6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ ప్రైమరీ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
1.74-అంగుళాల AMOLED స్క్రీన్ అదనుపు డిస్ల్పే
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
16MP ఫ్రంట్ కెమెరా
66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5,000mAh బ్యాటరీ
డాల్బీ అట్మాస్
యాక్షన్ కీ బటన్
MediaTek Dimensity 7300X ప్రాసెసర్
OIS + EISతో 50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా
8MP టెలిఫోటో లెన్స్ కెమెరా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









