River Indie Electric Scooter: మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని చాలా స్టార్ట్ అప్ కంపెనీలు ఎలక్ట్రిక్ బైకులను తయారుచేసి విక్రయిస్తున్నాయి. ఇందులో చాలా వరకు అద్భుతమైన ఫీచర్స్ తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసి సక్సెస్ అయిన కంపెనీలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని రివర్ బ్రాండ్ కూడా తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది గత రెండు సంవత్సరాల క్రితమే ఓ స్కూటర్ను విడుదల చేసింది. ఈ బ్రాండ్ కి సంబంధించిన స్కూటర్స్ మార్చి నెల వరకు దాదాపు 1,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీ స్టార్ట్ అప్‌లోనే దాదాపు 100 కోట్లు సంపాదించిందని వెల్లడించింది. ఇప్పటివరకు ఈ రివర్ బ్రాండ్ కు సంబంధించిన అవుట్‌లెట్‌లను భారతదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో మూడు అవుట్‌లెట్‌లు ఉండగా మిగతావి దేశవ్యాప్తంగా ఉన్నాయి.
2026 సంవత్సరం నాటికి రివర్ కంపెనీ 100 పైగా కొత్త అవుట్‌లెట్‌లను లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తోందని తెలిపింది. ముందు ఈ కంపెనీ భారత దేశంలోని దక్షిణ పశ్చిమ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ బైకులను విడుదల చేసింది. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన ఈవీ స్కూటర్స్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అతి త్వరలోనే ఈ కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం డిజైన్ తో పాటు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఈ స్కూటర్కు సంబంధించిన పూర్తిp వివరాలేంటో? ఏయే ధరల్లో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
రివర్ బ్రాండ్ తమ స్కూటర్ ఇండి (River Indie Electric Scooter) అనే పేరుతో విడుదల చేయబోతోంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ అన్ని స్కూటర్స్ కంటే ప్రత్యేకమైన డిజైన్తో విడుదల చేస్తోంది. ఇందులోని ఫ్రంట్ భాగంలో అద్భుతమైన శైలిలో హెడ్ లైట్స్ ఉంటాయి. ఇక ముందు భాగంలో ఎలా ఉందో వెనక భాగంలో కూడా అదే వెడల్పుతో కనిపిస్తూ ఉంటుంది. ఈ స్కూటర్ ముందువైపు డ్యూయల్ LED సెటప్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా చిన్న ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఈ స్కూటర్కు సంబంధించిన ముందు భాగంలో డ్యూయల్ పాడ్ LED హెడ్ లైట్స్ తో పాటు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ ఉన్నాయి. అలాగే 14 అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్ ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్యాటరీని చార్జింగ్ చేసుకునేందుకు ప్రత్యేకమైన ఛార్జింగ్ సెటప్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇక మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రత్యేకమైన యూఎస్బీ ఛార్జింగ్ సెటప్‌ను కూడా తీసుకువచ్చింది.
రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ (River Indie Electric Scooter) శక్తివంతమైన 4kW సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీతో విడుదల కాబోతోంది. దీనిని ఒక్కసారి చాట్ చేస్తే దాదాపు 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే శక్తిని అందిస్తుంది. ఇక ఈ స్కూటర్ ఫుల్ చార్జింగ్ కావడానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని కంపెనీ క్లైమ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే మోటర్ 26Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది మూడు సెకండ్లలోనే దాదాపు జీరో నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం 90 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. అయితే ఈ స్కూటర్కు సంబంధించిన అధికారిక లాంచింగ్ తేదీని త్వరలోనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించే అవకాశాలున్నాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









