Mobile Battery Charger Tips And Tricks: ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీలో అనేక మార్పులు వచ్చాయి. గతంలో మన మొబైల్స్ బ్యాటరీలను విడిగా తీసి చార్జింగ్ పెట్టే సిస్టమ్ ఉండేది. రాను రాను ప్రత్యేకమైన చార్జర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కంపెనీలు అన్ని స్మార్ట్ ఫోన్స్ కి సీ టైప్స్ ఛార్జింగ్ పిన్ సపోర్ట్ అందిస్తున్నాయి. దీంతో అందరూ తమ మొబైల్ కి కావలసిన ఛార్జింగ్ అందించి స్మార్ట్ ఫోన్స్ ని వినియోగిస్తున్నారు. అయితే మీలో ఎవరైనా ప్రతిరోజు స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ 100% పెడుతున్నారా? ఇలా ప్రతిరోజు పెట్టడం మంచిదేనా? దీనిపై టెక్నిక్ ను ఏమంటున్నారు? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది వారి స్మార్ట్ ఫోన్స్ కి దాదాపు 100% చార్జ్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇలా చార్జ్ చేయడం అంత మంచిది కాదని టెక్ నిపుణులు భావిస్తున్నారు.. ఇలా చేయడం వల్ల స్మార్ట్ ఫోన్ కు అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట అంతేకాకుండా కొన్నికొన్ని సందర్భాల్లో బ్యాటరీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందని వారంటున్నారు.. ప్రతిరోజు మీ స్మార్ట్ ఫోన్ను 80 శాతం వరకు చాట్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రాకపోయినప్పటికీ దీనిని కాస్త అదనంగా 20 శాతానికి పెంచితే.. మీరు చార్జ్ చేసే చార్జర్ వోల్టేజ్ 60 శాతం స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఒక్కసారిగా బ్యాటరీ వేడిగా మారి, పేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో బ్యాటరీ వేడవడం, బ్యాటరీ సరిగా పనిచేయకపోవడానికి గల కారణాలు ఇలా ప్రతిరోజు 100% వరకు బ్యాటరీ చార్జ్ చేయడమేనని వారంటున్నారు.
ప్రతిరోజు 60 వోల్టేజ్ కలిగిన చార్జర్ ను వినియోగించి స్మార్ట్ ఫోన్ బ్యాటరీని చార్జ్ చేసేవారు తప్పకుండా 80% వరకు చార్జ్ చేయడం చాలా మంచిదని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో 100% వరకు చార్జ్ చేయకూడదని వారంటున్నారు. ఇలా చేస్తే బ్యాటరీ లైఫ్ సులభంగా త్వరగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి బ్యాటరీ లైఫ్ బాగుండాలంటే ఎట్టి పరిస్థితుల్లో 60 నుంచి 70% వరకు బ్యాటరీని చార్జ్ చేయడం ఎంతో మంచిదని వారు భావిస్తున్నారు. అలాగే కొంతమంది రాత్రిపూట కూడా ఎక్కువగా మొబైల్ కి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం కూడా మంచిది కాదని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
కొంతమంది అయితే ఎప్పుడు బ్యాటరీ సేవర్ మోడ్ లో మొబైల్ను వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా వినియోగించడం చాలా మంచిదని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ మోడ్ లో చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ లైఫ్ మరింత పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయట. అంతేకాకుండా మొబైల్ వేడెక్కకుండా కూడా ఉంటుందని వారు అంటున్నారు. అయితే చాలామంది ఎక్కువ సేపు గేమ్స్ ఆడి మొబైల్ ఛార్జింగ్ పెడుతూ ఉంటారు.. ఇలా పెట్టడం కొంతమంది అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో బ్యాటరీ 100% నిండకుండా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా గేమ్స్ ఆడేవారు బ్యాటరీని దాదాపు 70 నుంచి 80% వరకు మాత్రమే చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే త్వరగా బ్యాటరీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









