Motorola Razr 60: దిమ్మతిరిగే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola కొత్త ఫ్లిప్‌ మొబైల్.. పూర్తి వివరాలు ఇవే!

Motorola Razr 60 Features Leak: త్వరలోనే మార్కెట్‌లోకి మోటరోలా రేజర్ 60 స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 27, 2025, 01:10 PM IST
Motorola Razr 60: దిమ్మతిరిగే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola కొత్త ఫ్లిప్‌ మొబైల్.. పూర్తి వివరాలు ఇవే!

Motorola Razr 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటరోలా మార్కెట్‌లోకి అద్భుతమైన మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. త్వరలోనే కంపెనీ మోటరోలా రేజర్ 60 పేరుతో మరో ఫ్లిప్‌ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. ఇది ప్రీమియం ఫీచచర్స్‌తో అత్యధునిక టెక్నాలజీతో లాంచ్‌ కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ విడుదలకు ముందే సోషల్ మీడియలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ మొబైల్‌  6.9-అంగుళాల ప్రధాన డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో లభించనుంది. ఇవు కాకుండా ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.      

Add Zee News as a Preferred Source

మోటరోలా కొత్త రేజర్ 60 ఫ్లిప్ ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. ఇది ఇప్పటికే TENAA సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మొబైల్ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ 1056 x 1056 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడా మోస్ట్ పవర్‌ఫుల్ 3.63-అంగుళాల OLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రెండవ డిస్ల్పే 6.9-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లేతో పాటు ప్రత్యేకమైన OLED డిస్ప్లేతో విడుదల కాబోతున్నట్లు లీక్‌ అయిన వివరాల్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ డిస్ల్పే 1080 x 2460 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానుంది.  

ఈ రేజర్ 60 ఫ్లిప్ ఫోన్ నాలుగు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో విడుదల కానుంది. దీని మొదటి వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్, రెండవది 12GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ వేరియంట్, మూడవది 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో లాంచ్‌ కానుంది. ఇక చివరి వేరియంట్‌ 18GB ర్యామ్‌తో పాటు 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో విడుదల కానుంది. ఇక కంపెనీ డైమెన్సిటీ 7400xతో లాంచ్‌ కానుంది. దీంతో పాటు ప్రత్యేకమైన  LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుందని సోషల్‌ వీడియాలో పేర్కొన్నారు. ఇక ఇందులోని సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్‌ను కూడా కలిగి ఉంటుంది. 

ఈ TENAA సర్టిఫికేషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఇది ప్రత్యేకమైన 3x ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి కానుంది. ఇక  బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇది శక్తివంతమైన 4500mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు లీక్‌ అయిన వివరాల్లో వెల్లడించారు. ఇక ఈ మొబైల్‌లో కంపెనీ డ్యూయల్ బ్యాటరీ సెటప్‌ను అందిస్తోంది. ఇది  1090mAh బ్యాటరీతో పాటు 3815mAhతో విడుదల కాబోతోంది. దీంతో పాటు ఈ Motorola Razr 60 స్మార్ట్‌ఫోన్‌ 30W వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఈ ఏడాదిలో ఏప్రిల్‌ నెలలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News