)
Nano Banana AI Trend: AI టెక్నాలజీ రోజురోజుకూ కొత్త కొత్త అప్డేట్స్తో ముందుకు సాగుతోంది. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణే "నానో బనానా". ఈ ఫొటో ఎడిటింగ్ టూల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యువతను ఈ ట్రెండ్ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ టూల్‌తో క్రియేట్ చేసిన ఫొటోలు చూస్తే.. బట్టలు, ఫేస్ ఎక్స్ప్రెషన్, బ్యాక్‌గ్రౌండ్ అన్నీ చాలా న్యాచురల్‌గా కనిపిస్తాయి. అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉండటంతో.. ఈ టూల్‌ను ఉపయోగించి ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా ఫొటోలను క్రియేట్ చేసుకుంటున్నారు.
అసలేంటి ఈ నానో బనానా క్రేజ్..?
ఇది గూగుల్ రూపొందించిన జెమినీ యాప్‌లో భాగమైన ఒక అప్డేటెడ్ టూల్. నానో బనానా అనేది దీని కోడ్ పేరు మాత్రమే. ఇది జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ మోడల్ ఆధారంగా తయారైంది. ఈ టూల్‌తో ఫొటోలను కొద్ది సెకన్లలోనే మనకు నచ్చిన విధంగా మార్చవచ్చు. దీన్ని నెటిజన్లు నానో బనానా అని ముద్దుగా పిలుస్తున్నారు.
ఎందుకింత పాపులర్..?
ఈ టూల్ ఎందుకంత పాపులర్ అయిందంటే.. దీన్ని వాడటం చాలా ఈజీ. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే చాలు.. ఇంకేలాంటి టెక్నాటజీ అవసరం లేదు. ఈ టూల్‌తో ఫొటోలను అద్భుతమైన 3D చిత్రాలుగా మార్చవచ్చు. ఇవి చూడటానికి ఖరీదైన బొమ్మల్లా కనిపిస్తాయి. అంతేకాదు, ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా సులభం కాబట్టి లైకులు, షేర్లు భారీగా వస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌లో చేరడంతో దీని క్రేజ్ మరింత పెరిగింది. ఇక చాలా మంది హీరోలు, హీరోయిన్ల పెట్స్ ఫొటోలను 3D బొమ్మలుగా మార్చి సోషల్ మీడియాను నింపేస్తున్నారు.
మీరు కూడా మీ ఫొటోని ఈ సింపుల్ స్టెప్స్‌తో 3Dగా మార్చేసుకోండి..
1. ముందుగా గూగుల్ జెమినీ వెబ్‌సైట్‌కు (https://gemini.google.com/)కి వెళ్లండి. అక్కడ మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి.
2. తర్వాత మీ ఫొటోను అప్లోడ్ చేయడానికి “+” బటన్‌పై క్లిక్ చేసి, అప్లోడ్ ఫైల్స్ ద్వారా మీ ఫొటోని అప్లోడ్ చేయండి.
3. దాని తర్వాత ఈ క్రింద ఇంగ్లీష్‌లో ఇచ్చిన ప్రాంప్ట్‌ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి.
4. కొన్ని సెకన్లలో ఆకర్షణీయమైన 3D ఫొటో సిద్ధమవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు.
ఒకవేళ జెమినీ AI వర్క్ చేయకపోతే ఇలా కూడా ట్రే చేయవచ్చు..
1st Step: ముందుగా Google AI Studio వెబ్‌సైట్‌కి వెళ్లి మీ గూగుల్ అకౌంట్‌కి లాగిన్ కావాలి.
2nd Step: అక్కడ మీకు “Nano Banana” లేదా “Gemini 2.5 Flash Image” అనే రెండు ఆప్షన్స్‌లో ఏది కనిపిస్తే ఆ టూల్‌ని ఎంచుకోండి.
3rd Step: ఇప్పుడు మీ ఫోటోను అప్లోడ్ చేయడానికి “+” బటన్‌పై క్లిక్ చేయండి.
4th Step (Optional): ఇంకా అమేజింగ్ అవుట్‌పుట్ కోసం, మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ కూడా ఇవ్వవచ్చు. అంటే మీకు మీ ఫొటో బొమ్మగా ఎలా ఉండాలో మాటల్లో వివరించడం. ఉదాహరణకు, “A beautiful girl in a white dress, standing on a wooden table with a smiling face” అని టైప్ చేయవచ్చు.
5th Step: ఇక అంతే.. AI మీ ఫోటోను ప్రాసెస్ చేసి 3D ఫొటోను సృష్టిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని.. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోండి.
మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..
1. మీరు ఇచ్చే ఫొటో ఎంత క్వాలిటీగా, బ్రైట్‌గా ఉంటే అవుట్‌పుట్ అంత బాగా వస్తుంది.
2. టెక్స్ట్ ప్రాంప్ట్‌లో దుస్తులు, లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్ వంటి వివరాలు ఇస్తే, బొమ్మ మరింత న్యాచురల్‌గా కనిపిస్తుంది.
3. ఒకే ఫొటోను వేర్వేరు యాంగిల్స్‌లో, డిఫ్రెంట్ టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో ట్రై చేసి చూడండి.
ఇదొక ట్రెండ్ మాత్రమే కాదు..
నానో బనానా కేవలం సరదా ట్రెండ్ మాత్రమే కాదు, ఇది ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును చూపిస్తోంది. ఒకప్పుడు 3D డిజైనింగ్ అంటే నిపుణుల పని. కానీ ఇప్పుడు ఈ టూల్‌తో ఎవరైనా తమ ఆలోచనలకు రూపం ఇవ్వవచ్చు. వినోదం, మార్కెటింగ్, విద్య వంటి రంగాల్లో ఈ టెక్నాలజీ కొత్త అవకాశాలను తెరుస్తోంది. ఈ ట్రెండ్ ఈ రోజు సోషల్ మీడియాలో మొదలై, రేపటి సృజనాత్మక ప్రపంచానికి బాటలు వేస్తోంది.
నెట్టింట్లో దూసుకెళ్తోంది..
ఈ టూల్ విడుదలైన మొదటి వారంలోనే 10 మిలియన్ల మంది కొత్త వినియోగదారులు జెమినీ యాప్‌ను ఉపయోగించారు. దాదాపు 200 మిలియన్ల చిత్రాలను ఎడిట్ చేశారు. నానో బనానా టూల్ ఫొటో ఎడిటింగ్‌ను సరళంగా, సరదాగా మార్చి సోషల్ మీడియాను ఆకర్షణీయంగా మార్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook