New Noise Earbuds Price: 50 గంటల పాటు ప్లే బ్యాక్‌.. చీప్‌ ధరకే నాయిస్ కొత్త ఎయిర్‌బడ్స్..

Noise Air Buds Pro 6 Earbuds Price: నాయిస్ కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన ఎయిర్ బడ్స్ ప్రో 6 ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 5, 2025, 05:39 PM IST
New Noise Earbuds Price: 50 గంటల పాటు ప్లే బ్యాక్‌.. చీప్‌ ధరకే నాయిస్ కొత్త ఎయిర్‌బడ్స్..

Noise Air Buds Pro 6 Earbuds Price: ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించే ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా స్టైలిష్‌ లుక్‌ కలిగిన వాటిని ఎక్కువగా యువత కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ఇలాంటి ఫీచర్స్‌తో కూడిన ఇయర్‌బడ్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అయితే మీరు కూడా హై బ్యాటరీ లైఫ్‌ కలిగిన ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ దేశీయ కంపెనీ నాయిస్ ఇటీవలే విడుదల చేసిన నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 ఇయర్‌బడ్‌లు అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది.

Add Zee News as a Preferred Source

ఈ నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 ఇయర్‌బడ్స్‌ అద్భుతమైన బ్యాటరీ సెటప్‌తో పాటు ప్రీమియం లుక్‌లో విడుదలైంది. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 50 గంటల వరకు ప్లే టైమ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. భారత మార్కెట్‌లో దీని ధర రూ. 3,500 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే దీనిని కంపెనీ ఏప్రిల్‌ 9వ తేది నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇయర్‌బడ్‌లు చూడడానికి ఇన్-ఇయర్ స్టైల్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా 12.4mm టైటానియం డ్రైవర్లతో కంపెనీ వీటిని విడుదల చేసింది.

నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 ఇయర్‌బడ్స్‌ (Noise Air Buds Pro 6 Earbuds) నాయిస్‌ క్యాన్సిలేషన్‌ కోసం ప్రత్యేకమైన నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 ఇయర్‌బడ్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో కంపెనీ 50 గంటల పాటు ప్లే బ్యాక్‌ను క్లైమ్‌ చేస్తోంది. ఇందులో డ్యూయల్ పెయిరింగ్‌ సపోర్ట్‌ ఆప్షన్‌ను కూడా తీసుకు వచ్చారు. దీని వల్ల రెండు పరికరాలను కనెక్ట్‌ చేసిన ప్లే చేసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 స్పేషియల్ ఆడియో ఎక్పీరియన్స్‌ను కూడా జాత చేసింది. దీని ద్వారా మంచి సౌండ్‌ క్వాలిటీని పొందవచ్చు.

ఈ ఇయర్‌బడ్స్‌లో LHDC కోడెక్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. 24-బిట్ హై క్వాలిటీ ఆడియో ఫీచర్ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఇన్‌స్టాచార్జ్ టెక్నాలజీకి మద్దతును కూడా అందిస్తోంది. అంతేకాకుండా దీనిని కేవలం 10 నిమిషాల ఛార్జ్‌ చేస్తే 150 నిమిషాల వరకు ప్లే బ్యాక్ టైమ్‌ పొందవచ్చు. అలాగే ఇందులో న్-ఇయర్ డిటెక్షన్, హైపర్ సింక్ కనెక్షన్ సపోర్ట్‌ ఫీచర్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా IPX5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.3,499 నుంచి ప్రారంభమవుతుంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News