Ola Roadster X Price: ప్రముఖ ఎలక్రిక్ కంపెనీ ఓలా మార్కెట్‌లోకి అద్భుతమైన మోటర్‌సైకిల్‌ను మార్కెటలోకి విడుదల చేసింది. తమ తొలి రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదలైంది. ఈ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ను అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే ఆకర్శనీయమైన డిజైన్‌తో కస్టమర్స్‌కి లభించనుంది. ఓలా కంపెనీ విడుదల చేసిన ఓలా రోడ్‌స్టర్ X మూడు బ్యాటరీ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. అంతేకాకుండా మొదటి బ్యాటరీ వేరియంట్ 2.5kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రానుంది. ఇక హై ఎండ్ బ్యాటరీ వేరియంట్ 4.5 kWh బ్యాటరీ ఆప్షన్‌తో విడుదలైంది. అయితే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఓలా రోడ్‌స్టర్ X మూడు బ్యాటరీల వేరియంట్స్ వివరాల్లోకి వెళితే.. ఇందులోని మొదటి వేరియంట్ ధర రూ.84,999 నుంచి ప్రారంభమవుతుంది. చివరి వేరియంట్ రూ.1,04,999 వరకు ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విక్రయాలు ఈ నెల చివరి వారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మోటర్‌సైకిల్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కొత్త అవతార్‌లో ఫ్యూచరిస్టిక్ లుక్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ బ్యాటరీ చాలా శక్తవంతమైన సామర్థ్యంతో విడుదల కానుంది.
ఈ ఓలా రోడ్‌స్టర్ X మోటర్‌సైకిల్ ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఫీచర్స్‌తో పాటు స్పెషల్ కనెక్టివిటీలతో విడుదల కానుంది. ఇందులో కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఇప్పటికే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన బుకింగ్ వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇవే కాకుండా ఓలా కంపెనీ ఈ మోటర్‌సైకిల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో విక్రయించబోతోంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
4.3-inch కలర్ LCD స్క్రీన్
స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
ఓలా ఎలక్ట్రిక్ యాప్‌లో ప్రత్యేకమైన ఫీచర్స్
టర్న్-బై-టర్న్ నావిగేషన్
OTA అప్‌డేట్‌లు
క్రూయిజ్ కంట్రోల్
రివర్స్ మోడ్
రీజెనరేటివ్ బ్రేకింగ్
మూడు రైడింగ్ మోడ్‌లు (Eco, Normal, Sport)
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)
బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ
ఫ్యూచరిస్టిక్ డిజైన్
సింగిల్ పీస్ సీట్
పిలియన్ గ్రాబ్-రెయిల్
180mm గ్రౌండ్ క్లియరెన్స్
IP67 వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ బ్యాటరీ
ఫ్లాట్ కేబుల్స్
ఫ్రంట్ డిస్క్ బ్రేక్
ఎనర్జీ ఇన్‌సైట్స్
జియోఫెన్సింగ్ మరియు యాంటీ-థెఫ్ట్ అలర్ట్‌లు
USB ఛార్జింగ్ పోర్ట్
ఆల్-LED లైటింగ్
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









