)
Oneplus Ace 6 Price Features: ఓన్‌ప్లస్ 13 సిరీస్ తర్వాత.. కంపెనీ త్వరలో అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. 8000 mAh బ్యాటరీ సామర్థ్యంతో ఫోన్‌ను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. ఇటీవల కంపెనీ 7100mAh శక్తివంతమైన బ్యాటరీతో ఓన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్‌ను పరిచయం చేసింది. ఇప్పుడీ కంపెనీ ప్రీమియం ఫోన్లలో కూడా పెద్ద బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది.
కంపెనీ ఓన్‌ప్లస్ ఏస్ 6 లో 8000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చని చెబుతున్నారు . ఈ ఫోన్ ఈ ఏడాది అక్టోబర్‌లో చైనా మార్కెట్లో లాంచ్ కావచ్చు. OnePlus నుండి వచ్చిన ఈ ఫోన్ వచ్చే ఏడాది భారతదేశంలో OnePlus 15 పేరుతో లాంచ్ కావచ్చు. ఇప్పటివరకు ఉన్న అత్యంత శక్తివంతమైన బ్యాటరీ కలిగిన ఫోన్ ఇదే కావచ్చు.
చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబోలోని టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు, రియల్మే, వన్‌ప్లస్ రెండూ అధిక సామర్థ్యం గల సెమీ-సాలిడ్ బ్యాటరీలతో ఫోన్లను లాంచ్ చేస్తాయని పేర్కొంది. ఇంతకుముందు, వన్‌ప్లస్ ఫోన్లో 8000 mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం లీక్ అయింది.
ఈ ఫోన్ 6.83 అంగుళాల పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ OLED డిస్ ప్లే ప్యానెల్‌తో వస్తుంది. ఇది 165Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ OnePlus ఫోన్‌ను క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 లేదా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5తో లాంచ్ చేయోచ్చు.
ఈ సంవత్సరం కంపెనీ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా OnePlus 13 సిరీస్‌లో మూడు ఫోన్లను విడుదల చేసింది. OnePlus 13, OnePlus 13R, OnePlus 13s లలో బలమైన కెమెరాతో పాటు అద్భుతమైన ఫీచర్లను కంపెనీ అందించింది. OnePlus రాబోయే ఫోన్ కూడా బలమైన ఫీచర్లతో లాంచ్ అవుతుంది. అదేవిధంగా Realme GT8ని 8000mAh బ్యాటరీతో కూడా అందించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook