)
OnePlus Pad 12 Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పటికే ఫ్రీడమ్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్ తో పాటు టీవీలు, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, టాప్స్‌పై 40 నుంచి 50 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా టాప్స్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి.
ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా OnePlus Pad 12 GB RAM ట్యాబ్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండడమే కాకుండా ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఇక OnePlus Pad ట్యాబ్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 11.61-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 2800 x 2000 పిక్సెల్స్ రిజల్యూషన్. డాల్బీ విజన్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 9000 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
ఈ ట్యాబ్ బ్యాక్ సెటప్‌లో 13 MP ప్రధాన కెమెరా (4K రికార్డింగ్), ముందువైపు 8 MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇది 9510 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS 13.1 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఈ OnePlus Pad ట్యాబ్ ధర వివరాల్లోకి వెళితే.. ఇది భారత్‌లో రూ.26 వేల నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనిని ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభించబోతోంది. దీని మార్కెట్ ధర రూ.39,999 కాగా.. ఈ సేల్‌లో కొనుగోలు చేస్తే.. 32 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.26,999కే పొందవచ్చు.
అదనంగా ఈ ట్యాబ్‌పై తగ్గింపు పొందడానికి ఇతను డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి ఈ ట్యాబ్ పేమెంట్ చేస్తే.. రూ.1,790 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.2,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది..ఇక ఈ OnePlus Pad ట్యాబ్ పై అదనంగా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పాత ట్యాబ్‌ను ఎక్స్చేంజ్ చేసి.. ఈ కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేసే వారికి రూ.16,460 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను కొత్త ట్యాబ్ ధర నుంచి మైనస్ చేస్తే.. రూ.8,549 కే ఈ కొత్త ట్యాంప్ పొందవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి