Oppo Find X8 Mini: దిమ్మతిరిగిపోయే ఫీచర్స్‌తో ఒప్పో మరో మొబైల్‌.. ఇందులో కొత్తగా బటన్‌ కూడా..!

Oppo Find X8 Mini Price: మార్కెట్‌లోకి Oppo Find X8 Mini స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉండబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 4, 2025, 12:04 PM IST
Oppo Find X8 Mini: దిమ్మతిరిగిపోయే ఫీచర్స్‌తో ఒప్పో మరో మొబైల్‌.. ఇందులో కొత్తగా బటన్‌ కూడా..!

Oppo Find X8 Mini Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో(Oppo) మార్కెట్‌లోకి మరో అద్భుతమైన మొబైల్‌ విడుదల కాబోతోంది. ఇది అధునాతన ఫీచర్స్‌తో లాంచ్‌ కాబోతోంది. అంతేకాకుండా ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒప్పో కంపెనీ ఈ మొబైల్‌ను 'ఫైండ్ ఎక్స్ 8 మినీ' పేరుతో విడుదల చేయనుంది. ఈ మొబైల్‌ స్లిమ్‌ బాడీని కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఫైండ్ ఎక్స్ 8 మినీ స్మార్ట్‌ఫోన్‌ గతంలో విడుదల చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్‌ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫీచర్స్‌ పరంగా కూడా ఇందులో కొన్ని అధునాత ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాల ప్రకారం తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన  ప్రెజర్-సెన్సిటివ్ బటన్‌ను కూడా అందిస్తోంది. దీనికి తోడు ఇతర కొత్త ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ Oppo Find X8 Mini స్మార్ట్‌ఫోన్‌ 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీని స్క్రీన్‌ 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే షార్ప్ విజువల్స్, స్మూత్ స్క్రోలింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో డిస్ప్లే చుట్టూ ఉన్న అల్ట్రా-థిన్ బెజెల్స్ ఫోన్‌ను డిజైన్‌ను ఆసక్తి కలిగించేలా చేస్తోంది.

ఈ ఫైండ్ X8 మినీ  స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 9400 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా గేమింగ్ చేసేవారికి ఈ మొబైల్‌ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన బ్యాక్‌ కెమెరా సెటప్‌ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన 50MP ప్రధాన కెమెరాను కెమెరాతో విడుదల కాబతోంది. ఇందులో ప్రత్యేకమైన అల్ట్రా-వైడ్‌ సెన్సార్‌తో పాటు ప్రత్యేకమైన జూమ్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.  అలాగే దీని జూమ్ లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ మార్చి లేద ఏప్రిల్‌ నెలలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మార్కెట్‌లోకి విడుదలైతే.. సాంసంగ్‌తో పాటు రియల్‌మీ, రెడ్‌మీ బడ్జెట్‌ మొబైల్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన ధర కూడా చాలా రిజనెబుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. దీని ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ ఈ మొబైల్‌ను విడుదల చేసే సమయంలోనే వెల్లడించనుంది. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News