Oppo Find X8 Ultra Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో అద్భుతమైన గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేయబోతోంది. ఇవి అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ ఫైండ్ ఎక్స్ 8 అల్ట్రాతో పాటు ఫైండ్ ఎక్స్ 8 నెక్స్ట్ పేర్లతో అందుబాటులోకి రానుంది. ఇది ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి వస్తోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన డిస్ప్లేతో పాటు కెమెరాను కలిగి ఉండబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా:
ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా (Oppo Find X8 Ultra) స్మార్ట్‌ఫోన్ గత మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఇది మొదటిసారిగా ఫ్లాట్ డిస్‌ప్లేతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ప్రీమియం ఫ్లాట్ స్క్రీన్‌తో పాటు అనేక రకాల ప్రత్యేకమైన డిస్ల్పే ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ డిస్ల్పే సెక్యూరుటీ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తోంది. దీంతో పాటు మరెన్నో కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఒప్పో ఫైండ్ X8 నెక్స్ట్:
ఈ ఫైండ్ X8 నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కూడా అందిస్తోంది. ముఖ్యంగా గేమింగ్ చేసేవారికి ఈ మొబైల్ చాలా బాగుటుంది. ఎక్కువ సేపు స్క్రోలింగ్ చేసేవారికి ఈ మొబైల్ చాలా బాగా పని చేస్తుంది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 9400 చిప్‌సెట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో గేమింగ్ చేసేవారికి కోసం కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది.
ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే..దీని బ్యాక్ సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరాను కూడా అందిస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లోకి విడుదలైతే.. ఫైండ్ X8 నెక్స్ట్, Samsung Galaxy S25 Edgeతో పాటు iPhone 17 Air మొబైల్స్‌తో పోటీ పడే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ధరలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









