)
OPPO Reno 15 Mini Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో (OPPO) మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. అతి త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతోంది. ఇది OPPO చరిత్రలోనే మొట్టమొదటి కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌గా ఉండబోతోంది. ఒప్పో కంపెనీ తమ Reno సిరీస్‌లోని OPPO Reno 15 Mini మొబైల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది చాలా అద్భుతమైన డిజైన్‌లో అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతోంది.
ఈ OPPO Reno 15 Mini స్మార్ట్ ఫోన్ గతంలో కంటే అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన 6.32-అంగుళాల ఫ్లాట్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇటీవల మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్స్ 6.7 అంగుళాల కంటే పెద్ద డిస్ప్లేను కలిగి ఉన్నాయి. అయితే, ఇదే అతి చిన్న డిస్ప్లేతో విడుదల కాబోతోంది.
రెనో 15 మినీ పట్టుకోవడానికి చాలా కాంపాక్ట్‌గా ఉండబోతోంది. అంతేకాకుండా చిన్న ప్యాకెట్లలో కూడా క్యారీ చేసేందుకు వీలుగా ఉంటుంది. దీని డిజైన్ కూడా గత మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ కలర్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్లు ఇందులో ఉండబోతున్నట్లు సమాచారం.
రెనో 15 మినీ OPPO Reno 15 Mini స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 200 MP కెమెరాతో విడుదల కాబోతోంది. అలాగే ఈ సిరీస్ మొత్తం మూడు మోడల్స్ (రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 మినీ)లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ మొబైల్స్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌ను, విడుదల తేదీని అందుబాటులోకి తీసుకురాలేకపోయినప్పటికీ.. డిసెంబర్లో లాంచ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ ఒప్పో రేనో సిరీస్ ప్రీమియం లుక్కును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది IP69 రేటింగ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్స్ కెమెరాకు ప్రసిద్ధి.. కాబట్టి ఈ మోడల్లో 200MP Samsung ISOCELL HP5 సెన్సార్ ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ కెమెరాలు కూడా లభించబోతున్నాయి. ఇక ఈ OPPO Reno 15 Mini మొబైల్‌కు సంబంధించిన ఫ్రంట్ భాగంలో కెమెరా 50MP అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ను వీక్ ఏమైనా వివరాల ప్రకారం.. తప్పకుండా డిసెంబర్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ధర గతంలో విడుదల చేసిన రేనో సిరీస్‌ల కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
NOTE: ఇక్కడ అందించిన సమాచారం కేవలం లీకైన వివరాలను ఆధారంగా తీసుకొని రాసింది మాత్రమే.. దీనిని జీ న్యూస్ అసలు ధ్రువీకరించదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook