)
POCO M6 Plus 5G Price Dropped: అత్యంత తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీని కంటే మంచి ఛాన్స్ రానే రాదు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమైయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ సేల్ ప్రారంభం కాకముందే కొన్ని మొబైల్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ అత్యంత చీప్ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై కొన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత చీప్ ధరకే లభిస్తున్న మొబైల్ ఏంటో? దానిపై ఉన్న ఆఫర్స్ ఏంటో? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం POCO బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ముఖ్యంగా POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత ఛీప్ ధరకే అందుబాటులో ఉంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. 6.79-అంగుళాల Full HD+ LCD డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో లభిస్తోంది.
ఈ POCO M6 Plus 5G మొబైల్ బ్యాంక్ సెటప్‌లో ఎంతో శక్తివంతమైన 108MP ప్రధాన కెమెరాతో పాటు 2MP మ్యాక్రో లెన్స్ డ్యూయల్ కెమెరాతో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో 13MP కెమెరా కూడా లభిస్తోంది. ఈ మొబైల్ శక్తివంతమైన 5,030 mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది ఆండ్రాయిడ్ v14 ఆధారిత HyperOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.
ఇక POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో లభిస్తోంది. అంతేకాకుండా IP53 డస్ట్‌తో పాటు స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ సపోర్ట్ IR బ్లాస్టర్, 3.5mm ఆడియో జాక్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌తో పాటు మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇక ఈ వేరియంట్స్ వివరాల్లోకి వెళితే, ఇది 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999తో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర రూ. 10,499తో పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో బేస్ వేరియంట్ మొబైల్‌పై అత్యంత తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తగ్గింపు ధరకే కొనుగోలు చేసేవారికి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. దీని కోసం ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పాటు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇక అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇలా కొనుగోలు చేసేవారికి భారీ ఎక్చేంజ్ బోనస్ పొందవచ్చు. ఈ బోనస్ పొందడానికి తప్పకుండా పాత మొబైల్ ఎక్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 9,900 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.99కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి