Poco M7 5G Price Drope: ఇప్పుడు అంతా పోకో మొబైల్స్ చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అద్భుతమైన కెమెరా సెట్ అప్‌తో పాటు శక్తివంతమైన డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే కొంతమంది యువత వీటి ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ చేసేందుకే కొత్త పోకో మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన పోకో స్మార్ట్ ఫోన్స్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా POCO M7 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన ఈ మొబైల్ ఎన్నడూ పొందలేని ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తుంది. అలాగే దీనిపై అదనంగా కొన్ని బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ POCO M7 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ లభించడం కాకుండా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ ధర MRP రూ.12,999 కాగా.. 23 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం ఇప్పుడు రూ.9,999కే లభిస్తోంది. అదనంగా దీనిపై బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి.. అదనంగా ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.
అదేవిధంగా ఈ మొబైల్ ను హెచ్డిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసే వారికి కూడా రూ.500 వరకు అదనపు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా బజాజ్‌కు సంబంధించిన కార్డును వినియోగించి ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకుంటే.. నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా పొందవచ్చు. ఇక ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ అన్నీ పోను రూ.8,500కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫ్లిప్కార్ట్ దీనిపై అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసే వారికి ఏకంగా రూ.4,500 వరకు ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ అనేది పాత మొబైల్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఎక్స్చేంజ్ చేసే మొబైల్ కండిషన్ బాగుంటేనే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ మొబైల్ పై ఉన్న ఈ ఎక్స్చేంజ్ బోనస్ కూడా పోను రూ.4 వేలకే కొత్త స్మార్ట్ ఫోన్ పొందవచ్చు.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు:
లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్, MIUI
ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్
MIUI యూజర్ ఇంటర్‌ఫేస్
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
4GB/6GB/8GB ర్యామ్, 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్స్
5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్
50MP AI డ్యూయల్ కెమెరా
మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్
90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









