Yamaha XSR 155: అబ్బబ్బ.. బైక్‌ అంటే ఇది.. యమహా XSR 155తో మార్కెట్‌ దద్దరిల్లిపోద్ది!

Yamaha XSR 155 Motorcycle: త్వరలోనే మార్కెట్‌లోకి శక్తివంతమైన యమహా XSR 155 మోటర్‌ సైకిల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ అందుబాటులోకి రానుంది. అయితే ఈ మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 10, 2025, 05:13 PM IST
Yamaha XSR 155: అబ్బబ్బ.. బైక్‌ అంటే ఇది.. యమహా XSR 155తో మార్కెట్‌ దద్దరిల్లిపోద్ది!

Yamaha XSR 155: శక్తివంతమైన మోటర్‌ సైకిల్స్‌ పెట్టింది పేరు యమహా.. కంపెనీ మార్కెట్‌లోకి ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన బైక్‌లను విడుదల చేస్తుంది. అయితే అతి త్వరలోనే ఈ కంపెనీ మరో బైక్‌ను విడుదల చేయబోతోంది. ఇది యమహా XSR 155 పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అద్భుతమైన ప్రీమియం లుక్‌తో విడుదల కాబోతోంది. ఈ మోటర్‌ సైకిల్ నియో-రెట్రో డిజైన్‌తో విడుదల కానుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఈ యమహా XSR 155 మోటర్‌ సైకిల్ స్పెషల్ లుక్‌లో కనిపించబోతోంది. దీనికి కంపెనీ అద్భుతమైన రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌తో పాటు టియర్‌డ్రాప్ ఇంధన ట్యాంక్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే టక్-అండ్-రోల్ సీటింగ్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది. యమహా కంపెనీ అద్భుతమైన డిజైన్‌ను అందిస్తోంది. స్పోర్ట్స్‌లో కనిపించేందుకు కంపెనీ ప్రత్యేకమైన యమహా హెరిటేజ్ లోగోను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందిస్తోంది.

యమహా XSR 155 మోటర్‌ సైకిల్‌లో ప్రత్యేకమైన వాల్వ్ యాక్చుయేషన్ (VVA) టెక్నాలజీని కూడా అందిస్తోంది. అలాగే ఇందులో కంపెనీ 155cc లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ ఇంజన్‌ పవర్‌ప్లాంట్ 10,000 rpm వద్ద 19.3 హార్స్‌పవర్‌ను అందిస్తుంది. దీంతో పాటు 8,500 rpm వద్ద 14.7 Nm టార్క్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ బైక్‌ ఇంధన సామర్థ్యం వివరాల్లోకి వెళితే.. ఇది 10-లీటర్ ఇంధన ట్యాంక్‌తో 40+ కి.మీ మైలేజీని అందిస్తుంది.

ఈ XSR 155 మోటర్‌ సైకిల్ ప్రత్యేకమైన సూపర్‌స్పోర్ట్ మోడల్‌ లుక్‌తో లాంచ్‌ కానుంది. ఈ మోటర్‌సైకిల్‌ అధిక బరువు లేకుండా ఉండడం వల్ల మంచి మైలేజీని అందిస్తుంది. ఇక ఈ బైక్‌లో 267mm ఫ్రంట్ డిస్క్‌తో పాటు రెండు-పిస్టన్ కాలిపర్, 220mm వెనుక డిస్క్ సెటప్‌లను అందిస్తోంది. ఇందులో ఇవే కాకుండా ప్రత్యేకమైన ABS సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ బైక్‌ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News