Samsung Galaxy S26: దిమ్మతిరిగే కలర్‌, చిప్‌సెట్‌తో Galaxy S26 సిరీస్‌ త్వరలో లాంచ్‌.. లీక్‌ ఫీచర్స్‌ ఇవే!

Samsung Galaxy S26 Ultra: సాంసంగ్‌ కంపెనీ Galaxy S26 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 22, 2026, 12:59 PM IST
Samsung Galaxy S26: దిమ్మతిరిగే కలర్‌, చిప్‌సెట్‌తో Galaxy S26 సిరీస్‌ త్వరలో లాంచ్‌.. లీక్‌ ఫీచర్స్‌ ఇవే!

Samsung Galaxy S26 Ultra Launch Date: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ సాంసంగ్‌ మార్కెట్‌లోకి త్వరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను విడుదల చేయబోతోంది. సాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 26 సిరీస్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా కంపెనీ మూడు మొబైల్స్‌  మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్ 26, గెలాక్సీ ఎస్ 26 ప్లస్‌తో పాటు గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్స్‌ మోడల్స్‌ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ఈ Samsung Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మొబైల్‌ ఏడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ సిరీస్‌ను కంపెనీ వైట్, స్కై బ్లూ, కోబాల్ట్ వైలెట్, పింక్ గోల్డ్, సిల్వర్ షాడోతో పాటు బ్లాక్ వంటి కలర్స్‌తో లాంచ్‌ చేయబోతోంది. Samsung వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన మూడు కలర్స్‌ను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. 

ఈ Samsung Galaxy S26 సిరీస్‌ను కంపెనీ వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ ఇప్పటికీ ఈ మొబైల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కానీ ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ Samsung Galaxy S26 సిరీస్ ఫిబ్రవరి 25న లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ధరలను వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఈ సిరీస్‌కి సంబంధించిన ధరలు కూడా లీక్‌ అయ్యాయి. 

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

సాంసంగ్‌ కంపెనీ ఈ సిరీస్‌ను గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది టెక్‌ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఈవెంట్‌ కూడా ఒక నెల ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మొబైల్స్‌ను కంపెనీ దక్షిణ కొరియాతో సహా కొన్ని మార్కెట్లలో విడుదల చేయబోయే మొబైల్స్‌ను 2 nm Exynos 2600 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇతర మార్కెట్‌లో విడుదల చేసే మోడల్స్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో లాంచ్‌ చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీనిని కంపెనీ భారతదేశ మార్కెట్‌లోకి కూడా త్వరలోనే లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News