Rajdoot 350Cc Bike Launch 2025: అద్భుతమైన రెట్రో లుక్‌తో మార్కెట్‌లోకి రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్ విడుదల కాబోతోంది. ఇది అత్యంత శక్తివంతమైన ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఈ పవర్‌ఫుల్ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1990లలో ఈ రాజ్‌దూత్ 350 బైక్‌కి మంచి క్రేజ్ ఉండేది.. కానీ కొన్ని కారణాల వల్ల దీని తయారీని కంపెనీ ఆపేస్తూ వచ్చింది. అయితే మార్కెట్‌లో గతంలో దీనికి ఉన్న క్రేజ్‌ను నేటి యువతకు పరిచయం చేసేందుకు అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి ప్రీమియం లుక్‌లో రాజ్‌దూత్ 350 బైక్ లాంచ్ కానుంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విడుదలకు ముందే సోషల్ మీడియాలో కొత్త రాజ్‌దూత్ 350 బైక్‌కి సంబంధించిన ఫోటోస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా త్వరలోనే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించే ఛాన్స్‌లు ఉన్నాయి. కానీ అధికారిక ప్రకటనకు ముందే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, ఇంజన్ వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మార్కెట్‌లోకి ఈ కొత్త రాజ్‌దూత్ 350 అందుబాటులోకి వస్తే.. రాయల్ ఎన్ఫిల్డ్‌తో పాటు జావా విడుదల చేసిన మోటర్‌సైకిల్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్ బైక్ ఫీచర్స్, ఇంజన్ అన్ని మోటర్‌సైకిల్స్ కంటే చాలా భిన్నంగా ఉండబోతోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన ఫినిషింగ్ విడుదల కానుంది. ఇక దీని విడుదల తేది వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 2026 సంవత్సరం చివరి నెలలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీని అధికారిక ప్రకటన ఈ ఏడాదిలోనే చివరి నెలల్లో ప్రకటించే ఛాన్స్‌లు ఉన్నాయి. ఇక దీని ఇంజన్ వివరాల్లోకి వెళితే.. కంపెనీ ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ ఇంజన్ 350cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో అందుబాటులోకి తీసుకు రానుంది.
కొత్త రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.70 లక్షలతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది వివిధ వేరియంట్స్‌లో విడుదలవుతుంది. కాబట్టి వేరియంట్‌ని బట్టి ధర ఉండబోతోంది. ఇక ఈ మోటర్‌సైకిల్ లీటర్ పెట్రోల్‌కి 45kmpl వరకు మైలేజీని అందించనుంది. ఇందులో ప్రత్యేకమైన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు డ్యూయల్ ఛానల్ ABS, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఇందులో స్పెషల్ స్టైలిష్ LED హెడ్‌లైట్‌తో పాటు LED టెయిల్‌లైట్‌ను కూడా అందిస్తోంది.
చూడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









