Realme 14 5G Price: ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మీ మార్కెట్ తమ పేరును నిలబెట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన డిజైన్స్‌తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో చాలా వరకు శక్తివంతమైన ఫీచర్స్‌తో మొబైల్స్ లాంచ్ అవుతూ వస్తున్నాయి. తాజాగా రియల్‌మీ కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను తమ కస్టమర్స్‌కి పరిచయం చేసింది. ఇది ప్రీమియం డిజైన్‌తో అద్భుతమైన AI ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అందరు మెచ్చే ధరలోనే విడుదల కావడం మంచి విశేషం. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రియల్‌మీ కంపెనీ తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను Realme 14 5G పేరుతో విడుదల చేసింది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ బ్యాటరీతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ థాయిలాండ్‌లో లాంచ్ చేసింది. ఇది మిడ్‌రేంజ్ ధరలో విడుదలైంది. ఈ Realme 14 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 6.67-అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్ల్పేతో విడుదల చేసింది. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్ Snapdragon 6th Gen 4 SoC ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది.
ఇక ఈ మొబైల్ ఫ్రంట్ భాగంలో 16MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో ప్రత్యేకమైన ఏరోస్పేస్-గ్రేడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో స్పెషల్‌గా GT బూస్ట్ ఫీచర్‌తో పాటు AI మోషన్ కంట్రోల్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ప్రత్యేకమైన AI అల్ట్రా టచ్ కంట్రోల్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైన కనెక్టివిటీ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. రియల్ మీ కంపెనీ ఇందులో ప్రత్యేకమైన గేమింగ్ ఫీచర్స్‌లో భాగంగా ఫ్రీ ఫైర్‌తో భాగస్వామ్యం కూడా అందిస్తోంది. దీంతో పాటు కొన్ని స్పెషల్ గేమింగ్ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది.
ఈ Realme 14 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది వెన భాగంలో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా సెకండరీ 2MP పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో IP69 రేటింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 6000mAh టైటాన్ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌తో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీని బేస్ వేరియంట్ ధర రూ.30,405 నుంచి ప్రారంభమవుతుంది. ఇది హై ఎండ్ వేరియంట్ రూ.35,420గా ఉంటుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









