realme GT 7 Pro Ultra 2025 Model: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో భాగంగా చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త మొబైల్స్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా రెడ్‌మీ, రియల్‌మీ, సాంసంగ్ కంపెనీలు కూడా తమ కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నాయి. బార్సిలోనాలో జరిగే "అల్ట్రా క్లారిటీ బియాండ్ ఫ్లాగ్‌షిప్" వేదికగా realme నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. ఇది అతి శక్తివంతమైన కెమెరాలతో పాటు ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ MWC 2025లో భాగంగా విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్ realme GT 7 Pro Ultra 2025 Model పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్ లాగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని బ్యాక్ కెమెరా అచ్చం చూడడానికి DSLR కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ సెటప్ డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతోంది. అలాగే ప్రీమియం కలర్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ realme GT 7 Pro Ultra 2025 Model స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీని బ్యాక్ సెటప్‌లోని కెమెరా పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌లో విడుదల కాబోతోంది. అంతేకాకుండా దీని ప్రధాన కెమెరా దాదాపు 1 అంగుళం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కెమెరా సెటప్‌లో 120x జూమ్ సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన 10x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన అదనపు కెమెరా సెన్సార్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కెమెరా పరంగా చూస్తే ఇటీవలే విడుదలైన Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్‌కు చాలా సిమిలర్‌గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.
త్వరలో విడుదల కాబోయే realme GT 7 Pro Ultra 2025 Model స్మార్ట్‌ఫోన్ అత్యధునిక చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన గేమింగ్ ఫీచర్స్‌తో ఇది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన అనేక వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో మార్కెట్‌లోకి లాంచ్ అయితే.. అత్యుత్తమ ఫోటోగ్రఫీ గేమ్-ఛేంజింగ్ స్మార్ట్‌ఫోన్‌గా పేరు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









