)
Redmi 15C 5G Launch Date Latest News: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మీ త్వరలో భారత్‌లో అద్భుతమైన మొబైల్ విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం స్పెషిఫికేషన్స్లో లాంచ్ కాబోతున్నట్లు కంపునీ వెల్లడించింది.. దీనిని కంపెనీ రెడ్మి 15C 5G పేరుతో లాంచ్ కాబోతున్నట్లు తెలిపింది. అలాగే ఇది ప్రీమియం డిజైన్‌తో విడుదల కాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Redmi 15C 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 6,000 mAh బ్యాటరీతో లాంచ్ కాబోతోంది. అంతేకాకుండా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ను రెడ్మీ కంపెనీ డిసెంబర్ 3వ తేదిన విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే దీనికి సంంబంధించిన అధికారక ప్రకటనను కంపెనీ చేసింది. ఇప్పటికే భారత్‌లోని కొన్ని వెబ్‌సైట్స్‌లో ప్రత్యేకమైన మైక్రోసైట్ కూడా రన్ అవుతోంది. ఈ మొబైల్ Xiaomi ఇ-స్టోర్‌తో పాటు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Amazonలో కూడా అందుబాటులోకి రానుంది.
ఈ Redmi 15C 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మొత్తం మూడు రంగు( బ్లూ, డస్క్ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్ )లో అందుబాటులోకి రాబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన 6.9-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు దీని స్క్రీన్ 120 Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్ చాలా శక్తివంతమైన MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ఇది Android 15 ఆధారంగా Xiaomi HyperOS 2 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
ఇటీవలే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని లీక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇది 4GB ర్యామ్‌తో 128GB స్టోరేజ్ వేరియంట్లో రూ.13,999తో అందుబాటులోకి రాబోతోంది. ఇక మరో వెరియంట్ 8GB + 128GB స్టోరేజ్ మొబైల్ రూ.14,999తో లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ సెప్టెంబర్‌లో పోలాండ్‌లో విడుదల చేసింది. అయితే, భారత్‌లో విడుదల చేసే వేరియంట్స్నే నేషనల్ వైడ్‌గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కూడా కలిగి ఉంటుంది.
Redmi 15C స్మార్ట్‌ఫోన్ వెనక కెమెరా సెటప్‌లో అదనంగా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుది. దీంతో పాటు అదనంగా 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందుబాటులోకి వస్తోంది. ఇందులో చాలా ప్రత్యేకమైన సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ 6,000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుందని సమాచారం. ఇటీవలే కంపెనీ మార్కెట్లోకి Redmi K90 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను కూడా విడుదల చేసింది. ఇది కూడా ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook