Redmi A4 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అత్యంత తక్కువ ధరల్లోనే ఈ కంపెనీ మొబైల్స్ లభించడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి రావడం వల్ల పాత మోడల్స్‌పై ధర తగ్గిపోతున్నాయి. దీంతో ఆ మొబైల్స్ చాలా చౌకగానే లభిస్తున్నాయి. గతంలో మార్కెట్‌లోకి విడుదలైన REDMI A4 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరతో లభిస్తోంది. ఈ మొబైల్ డిస్ల్పే 6.88 అంగుళాల HD+తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 720 x 1640 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో విడుదల కాబోతోంది.
ఈ REDMI A4 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 4GB ర్యామ్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. అలాగే స్టోరేజ్ పెంచుకునేందుకు ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు 50MP ప్రధాన కెమెరా లభిస్తుంది. ఇక దీని ఫ్రంట్ భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే దీని బ్యాటరీ 5160mAh కలిగి ఉంటుంది. దీంతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌లను కూడా కలిగి ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ REDMI A4 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ధర MRP రూ.11,999తో విక్రయిస్తోంది. అయితే దీనిని ఇప్పుడే ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు 18 శాతం వరకు డిస్కౌంట్‌తో కేవలం రూ.9,833కే పొందవచ్చు. ఇక ఇవే కాకుండా దీనికిపై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీని కోసం ముందుగా ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో రూ.700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ అన్నిపోనూ.. కేవలం రూ.9,133కే పొందవచ్చు.
ఇక ఈ REDMI A4 5G స్మార్ట్‌ఫోన్‌పై కొన్ని లోకేషన్స్ ఫ్లిఫ్‌కార్ట్ ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ప్రత్యేకమైన లోకేషన్స్‌కు సంబంధించిన వారు ఈ ఎక్చేంజ్ ఆఫర్ వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ ఆఫర్స్ కూడా పొనూ.. కేవలం రూ. 5,133కే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం కొన్ని లోకేషన్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









