)
Electric Bill Reduce Tips For Home: ప్రస్తుతం కొంతమంది ఇళ్లలో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీలు వంటివి ఏమీ లేకపోయినప్పటికీ వేల రూపాయల కరెంట్ బిల్ వస్తుంది. దీని కారణంగా కొంతమంది తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ఇంట్లో ఏమి వాడకుండా ఎంత మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో కొంతమంది విద్యుత్ అధికారులకు కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోతోంది. ఇక మరికొంతమంది అయితే విద్యుత్ బిల్లును తగ్గించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. అయితే, కొన్ని ట్రిక్స్‌తో సులభంగా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం కొంతమంది ఇళ్లలో ఏమీ వాడలేకపోయినప్పటికీ రూ.5,000 వరకు బిల్లు వస్తుంది. అయితే, దీనిని రూ.500 తగ్గించుకోవడానికి కొన్ని ట్రిక్స్ వినియోగించాల్సి ఉంటుంది. అయితే, చిన్న చిన్న ట్రిక్స్‌ను వినియోగించి ఎలా సులభంగా కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యంగా ఇంట్లో మనం ఎక్కువగా ఏసీలను వినియోగిస్తూ ఉంటాం.. అయితే, విద్యుత్ బిల్లులో 20 శాతం ఏసీకి సంబంధించిన పవర్ బిల్లే ఉంటుంది. ఏసీ ఎక్కువగా కరెంటును వినియోగిస్తుంది. రోజుకు 8 నుంచి 10 గంటలకు పైగా ఏసీని వినియోగిస్తే.. విద్యుత్ ఖర్చులో భాగంగా 40 శాతం వరకు ఉంటుందని ఎవ్వరికీ తెలీదు. అలాగే కొంతమంది ఎక్కువగా గీజర్ కూడా వినియోగిస్తారు. ఇది కూడా పవర్‌ను ఎక్కువ వినియోగిస్తుంది. కొంతమంది ఇళ్లలో పాత రిఫ్రిజిరేటర్లు కూడా 24 గంటల పాటు ఆన్‌లో ఉంటాయి. దీనివల్ల కూడా ఎక్కువ మోతాదులో విద్యుత్ ఖర్చయ్యే అవకాశాలున్నాయి.. ముఖ్యంగా విద్యుత్ బిల్లులో భాగంగా తక్కువ ఎనర్జీ రేటింగ్ కలిగిన అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు వినియోగించినప్పుడు.. బిల్లు అదనంగా 15 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అలాగే రిఫ్రిజిరేటర్ తలుపులు అదేపనిగా తెరిస్తే.. పవర్ బిల్లు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సాధారణ బిల్లు కంటే వీటివల్ల.. పవర్ బిల్లు భారీ మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కొంతమంది ఎక్కువగా వాషింగ్ మిషన్లు కూడా వినియోగిస్తున్నారు. దీనివల్ల కూడా ఊహించని స్థాయిలో కరెంట్ వినియోగం పెరుగుతుంది.
రూ.5,000 ఉన్న కరెంటు బిల్లును రూ.500కు తగ్గించుకునే అద్భుతమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. అందులో విద్యుత్ ఆదా ఒకటి. చాలామంది ఇప్పటికి ట్యూబ్లైట్లను వినియోగిస్తున్నారు. ఇంటికి బదులుగా ఎల్ఇడి లైట్లను వినియోగించడం చాలా మంచిది. దీనివల్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశాలున్నాయి. దీంతోపాటు సోలార్ సిస్టం పవర్ సెటప్‌ను వినియోగిస్తే.. భారీ మొత్తంలో డబ్బులు ఆదా చేసుకోవచ్చు. మొదటగా సోలార్ పవర్ సిస్టం పెట్టుకోవడానికి కొన్ని డబ్బులు ఖర్చయినప్పటికీ.. కొన్ని రోజుల తర్వాత విద్యుత్ బిల్లు తగ్గుతూ వస్తుంది. అవసరమున్నప్పుడు కరెంటు వినియోగించుకొని.. ఆ తర్వాత సోలార్ సిస్టం నుంచి ఉత్పత్తి అయిన కరెంటు వినియోగించుకుంటే.. రూ.4000 ఉన్న పవర్ బిల్.. రూ.400కు తగ్గిపోవడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook