Haier 240 L Double Door Refrigerator Price Cut: ఎప్పటి నుంచో చీప్ ధరలోనే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మహా శివరాత్రి వేళ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ గుడ్‌న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో గతంలో మార్కెట్‌లోకి విడుదలైన హైయర్ (Haier) కంపెనీ ఫ్రిడ్జ్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. దీనిపై ఫ్లిఫ్‌కార్ట్ సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ హైయర్ 240 ఎల్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫ్లిఫ్‌కార్ట్‌లో హైయర్ 240 ఎల్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ మూడు కెపాసిటీలతో పాటు మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ ఫ్రిడ్జ్ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీనిపై ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ లభించడమే కాకుండా కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. మార్కెట్‌లో దీని MRP ధర రూ.29,990 కాగా.. మహా శివరాత్రి సందర్భంగా 28 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో ఇప్పుడు ఈ రిఫ్రిజిరేటర్ రూ.21,490కే లభిస్తోంది.
ఇక ఈ ఫ్రిడ్జ్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే..దీనిని ఇప్పుడు ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేవారికి 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా మహా శివరాత్రి సందర్భంగా కొనుగోలు చేసేవారికి ఏ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, UPIతో పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుది. దీంతో ఈ డిస్కౌంట్ ఆఫర్ పోనూ.. రూ.19,990కే పొందవచ్చు.
ఫ్లిఫ్‌కార్ట్ శివరాత్రి సందర్భంగా ఈ ఫ్రిడ్జ్‌పై ప్రత్యేకమైన ఎక్చేంజ్ బోనస్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం మీరు వినియోగిస్తున్న పాత రిఫ్రిజిరేటర్‌ను ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.5,350 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఇక ఈ ఆఫర్ పోనూ.. రూ.14,640కే పొందవచ్చు. ఇవే కాకుండా దీనిపై ఇతర అనేక డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









