Samsung 1st Tri-Fold Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ సాంసంగ్ విడుదల చేసే ప్రతి మొబైల్‌కి మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లోనే లాంచ్ అవుతూ ఉంటాయి. దీని సేల్స్ కూడా అంతే లెవల్ ఉంటాయి. యువత కూడా ఎక్కువ సాంసంగ్ మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని సాంసంగ్ మరో గుడ్‌న్యూస్ తెలపబోతోంది. మార్కెట్‌లోకి ఎంతో శక్తివంతమైన మొబైల్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రై-ఫోల్డ్ సెటప్‌లో అందుబాటులోకి రానుంది. దీనిని సాంసంగ్ మొట్ట మొదటిసారిగా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాంసంగ్ కంపెనీ విడుదల చేయబోయే మొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రీమియంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఇందులో మూడు డిస్ల్పేలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది విభిన్న లుక్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ ట్రై-ఫోల్డ్ డిజైన్ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది టాబ్లెట్ లాగా కనిపిస్తుంది. అలాగే ఇందులో ఆఫీస్ పనులు కూడా ఎంతో సుభంగా చేయవచ్చు. మీకు కావాల్సినప్పుడు ఈ మొబైల్‌ను మడపెట్టుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. గేమింగ్ చేసేవారికి ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లో 10-అంగుళాల పెద్ద స్క్రీన్ ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా Samsung తాజా అల్ట్రా-థిన్ గ్లాస్ (UTG) టెక్నాలజీతో ఈ మొబైల్‌ణు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సాంసంగ్ ఇందులో ప్రత్యేకమైన డిస్ల్పే ప్రొటక్షన్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ డిస్ల్పే చాలా ప్రీమియంగా ఉండబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ ప్రత్యేకమైన Samsung S పెన్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. సాంసంగ్ కంపెనీ ఈ ట్రై-ఫోల్డ్ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది.
అధికారిక వివరాల ప్రకారం, ఈ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ లేదా జూన్ నెలలో అందుబాటులోకి తీసుకు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే జూలైలో విడుదల కాబోయే గెలాక్సీ Z ఫోల్డ్ 7తో పాటు గెలాక్సీ Z ఫ్లిప్ 7 స్మార్ట్‌ఫోన్స్‌తో ఈ ట్రై-ఫోల్డ్ మొబైల్ కూడా విడుదల కావచ్చని కొందరు టెక్ నిపుణులు తెలుపుతున్నారు. కంపెనీ ఈ మొబైల్‌ను కేవలం మొదట 200,000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీని ధర ఊహించినదాని కంటే చాలా ఎక్కువగానే ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









