)
Samsung Galaxy A17 5G Launch: శాంసంగ్ గ్యాలక్సీ ఏ17 5G భారతదేశంలో ప్రారంభించబడింది. ఇటీవల ఈ శాంసంగ్ ఫోన్ UK మార్కెట్లోకి వచ్చింది. భారతదేశంలో శాంసంగ్ దీనిని 8 GB ర్యామ్, 256 GB వరకు స్టోరేజ్‌తో పరిచయం చేసింది. ఈ ఫోన్లో AI ఫీచర్లు అందుబాటులో కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి విడుదలైన శాంసంగ్ గ్యాలక్సీ ఏ16 మోడల్ కి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రాసెసర్, కెమెరా వంటివి కూడా అప్‌గ్రేడ్ చేశారు.
ఎంత ఖర్చవుతుంది?
శాంసంగ్ గెలాక్సీ A17 5G ని మూడు స్టోరేజ్ వేరియంట్లలో భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్, 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్, 8 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్లు రానున్నాయి. ఈ మొబైల్ ర్యామ్‌ను విస్తరించుకనే అవకాశం ఉంది. దీని రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 20,499, రూ. 23,499 ఉన్నాయి. ఈ ఫోన్‌ను శాంసంగ్ అధికారిక స్టోర్లతో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. బ్లూ, బ్లాక్, గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ17 5G ఫీచర్లు
ఈ Samsung ఫోన్ 6.7-అంగుళాల FHD+ Infinity U సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీని రిజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్స్. ఈ ఫోన్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ నీరు, ధూళి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ చౌకైన Samsung ఫోన్ Galaxy AI ఫీచర్ కలిగి ఉంది. Android 15 ఆధారంగా OneUI 7పై పని చేస్తుంది.
శాంసంగ్ గ్యాలక్సీ ఏ17 5G స్మార్ట్ ఫోన్ Exynos 1330 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ తో లభిస్తుంది. దీనికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది పవర్ బటన్‌తో అనుసంధానించారు. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనికి 50MP మెయిన్, 2MP సెకండరీ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్లో 13MP కెమెరా ఉంది.
ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనితో పాటు 25W USB టైప్ C ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం ఈ Samsung ఫోన్ 5G/4G నెట్వర్క్, బ్లూటూత్ 5.3, Wi-Fi, USB టైప్ C వంటి ఫీచర్లను కలిగి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook