SAMSUNG Galaxy A35 5G Price: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ మార్కెట్లోకి ఎప్పుడు మొబైల్స్‌ని విడుదల చేసిన అద్భుతమైన ఫీచర్స్‌తో ప్రీమియం డిజైన్స్ ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ కూడా ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కావడం విశేషం. అయితే, గతంలో విడుదలైన SAMSUNG Galaxy A35 5G స్మార్ట్ ఫోన్ కి మార్కెట్లో మంచి ప్రజాతరణ లభించింది. అత్యంత తక్కువ ధరలోని చీప్ ధరకే ఈ మొబైల్ లభించడంతో చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చెబుతున్నారు.
ఈ మొబైల్ డిస్ప్లే వివరాల్లోకి వెళితే, దీనిని కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేతో విడుదల చేసింది. స్క్రోలింగ్ కోసం ప్రత్యేకమైన స్క్రీనింగ్ కూడా అందించింది. ఇవే కాకుండా ఈ డిస్ప్లే గేమింగ్ చేసేందుకు చాలా బాగుంటుంది. SAMSUNG Galaxy A35 5G స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇందులో కంపెనీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రధాన కెమెరాను అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేకమైన స్పష్టతతో కూడిన వీడియో రికార్డింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది.
అలాగే ఈ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. ఇక రెండవది 256 జీబీ ఇంటర్నల్ స్టోరీస్ తో వస్తోంది. ఇక ఇందులో కంపెనీ 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా అందిస్తోంది..ప్రస్తుతం ఈ SAMSUNG Galaxy A35 5G స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ మధ్య ఇప్పుడు ఇది లభిస్తోంది. దీని ధర మార్కెట్లో MRP రూ.33,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా 23% ఫ్లాట్ డిస్కౌంట్తో లభిస్తోంది.
ఇక ఈ 23 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పోను.. రూ.25, 999కే పొందవచ్చు. అలాగే దీనిపై స్పెషల్గా ఫ్లిప్కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ను వినియోగించాలనుకునేవారు ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. SAMSUNG Galaxy A35 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఇతర బ్యాంక్ ఆఫర్స్ చూస్తే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగిస్తే రూ.11,380 బోనస్ లభిస్తుంది. ఇక ఈ బోనస్ పోను ఈ మొబైల్ కేవలం రూ.14,619కే లభిస్తుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









