)
Samsung Galaxy F16 5G Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ సాంసంగ్ (Samsung) ఎప్పటికప్పుడు తమ కొత్త స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. అతి శక్తివంతమైన ఫీచర్స్ తో కూడిన ఈ కంపెనీ విడుదల చేసే మొబైల్స్ చాలా మంది యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే అతి తక్కువ ధరల్లో లభించే శాంసంగ్ మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల మొబైల్స్ డిమాండ్ ఇంకా పెరిగిపోయి.. మంచి ప్రజాదరణ లభిస్తూ వస్తోంది. అయితే ఇటీవలే శాంసంగ్ కంపెనీ సైలెంట్ గా ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది గెలాక్సీ F16 5G అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన ఫీచర్స్ తో ప్రీమియం లుక్కుతో విడుదలైంది. అంతేకాకుండా అద్భుతమైన AI ఫీచర్స్ ను కూడా కలిగి ఉంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రముఖ Samsung కంపెనీ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ F16 ఆకర్షనీయమైన డిజైన్‌తో ప్రస్తుతం సాంసంగ్ అధికారిక వెబ్సైట్ తో పాటు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. ఇందులో ప్రత్యేకమైన One UI 7తో పాటు ఆరు సంవత్సరాల Android OS అప్గ్రేడ్లను కూడా అందిస్తోంది. ఇక ఈ Samsung Galaxy F16 5G స్మార్ట్ ఫోన్ ధర వివరాల్లోకి వెళితే.. భారతదేశంలో ఈ మొబైల్ ధర రూ.11,499 నుంచి ప్రారంభమవుతుంది.
అయితే భారతదేశంలో మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన విక్రయాల అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఓ బ్యానర్ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులోని కంపెనీ విక్రయ తేదీని కూడా ప్రకటించింది మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ మొబైల్ కు సంబంధించిన విక్రయాలు అధికారిక వెబ్‌సైట్స్ తో పాటు ఆఫ్ లైన్స్ స్టోర్స్ ఈ కామర్స్ స్టోర్స్ లో కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు అందులో వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది ఇందులోని ప్రధాన వేరియంట్ ధర రూ.16,499తో విక్రయించబోతోంది.
Samsung Galaxy F16 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:
ఈ Galaxy F16 5G అతి శక్తివంతమైన U-ఆకారపు నాచ్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ డిస్ప్లే ఎంతో ప్రత్యేకమైన 1080 x 2340 పిక్సెల్‌ల FHD+ రిజల్యూషన్ కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్, 800 nits గరిష్ట బ్రైట్నెస్ను కూడా ఈ డిస్ప్లే అందిస్తోంది. ఇక కంపెనీ ఇందులో 6 సంవత్సరాల Android OS అప్గ్రేడ్లను కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన బ్యాక్ సెట్ వివరాల్లోకి వెళితే.. ఇది త్రిబుల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది. ఇందులోని 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు ప్రత్యేకమైన13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.