Samsung Galaxy S25 Edge Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ సాంసంగ్ త్వరలోనే గుడ్‌న్యూస్ తెలపబోతోంది. ఈ మొబైల్ సాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge) పేరుతో విడుదల కాబోతోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా దీని బ్యాక్‌సెటప్‌లో ఎంతో శక్తివంతమైన 200MP కెమెరాతో విడుదల కాబోతోంది. ఇందులో ఎన్నో రకాల కొత్త AI ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కి ముందే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన లీక్ అయిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ సాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge) స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 3900 mAh బ్యాటరీతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా అలాగే ఇది అత్యంత సన్నని డిజైన్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ త్వరలోనే ఈ మొబైల్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీని డిస్ల్పే 6.7 అంగుళాల OLED స్క్రీన్‌తో విడుదల కాబోతున్నట్లు లీక్ అయిన వివరాల్లో తెలిపారు. అంతేకాకుండా ఇది 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కూడా కలిగి ఉండబోతోంది.
ఈ శక్తివంతమైన Samsung Galaxy S25 Edge స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్‌తో విడుదల కాబోతోంది. ఇది 2600 నిట్స్ (పీక్) బ్రైట్‌నెస్‌తో పాటు ప్రత్యేకమైన 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 3900mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రానుంది. అంతేకాకుండా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. అలాగే స్పెషల్‌గా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానుంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్‌ఫుల్ Octa Core ప్రాసెసర్‌పై రన్ కానుంది. దీనిని కంపెనీ మొదట 128 GB ఇన్‌బిల్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకు రానుంది. ఇక సాంసంగ్ కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని ధర వివరాలను కూడా లీక్ అయిన వివరాల్లో పేర్కొన్నారు. దీనిని కంపెనీ విడుదల చేస్తే ధర రూ. 49,990 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









