Samsung New Launch: కేవలం 10 వేలకే 50MP కెమేరాతో 5జి స్మార్ట్‌ఫోన్లు, పూర్తి వివరాలు ఇవే

Samsung New Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి అత్యంత తక్కువ ధరకు 5జి ఫోన్ లాంచ్ అయింది. అందరికీ అందుబాటు ధరలో ఉండటంతో మార్కెట్‌‌లో ప్రత్యేకత నిలుపుకోనుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2025, 09:11 PM IST
Samsung New Launch: కేవలం 10 వేలకే 50MP కెమేరాతో 5జి స్మార్ట్‌ఫోన్లు, పూర్తి వివరాలు ఇవే

Samsung New Launch: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో క్రేజ్ ఎక్కువ. ఇందులో అందరికీ అందుబాటులో తక్కువ ధర నుంచి ప్రీమియం రేంజ్ వరకూ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 5జీ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లాంచ్ చేసింది. M సిరీస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లను కేవలం 10 వేల రూపాయలకే ప్రవేశపెట్టింది. 

Add Zee News as a Preferred Source

శాంసంగ్ కొత్తగా Samsung Galaxy M16, M06 స్మార్ట్ ఫోన్లను అందరికీ అందుబాటు ధరలో లాంచ్ చేసింది. శాంసంగ్ ఫోన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎం సిరీస్ ఫోన్‌లు ఇవి. Samsung Galaxy M06 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇక  Samsung Galaxy M16 అయితే 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ ఎమోల్డ్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెట్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ రెండు మోడల్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తాయి. 

Samsung Galaxy M06లో ప్రైమరీ కెమేరా 50 మెగాపిక్సెల్ ఉండి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమేరా ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కేమేరా ఉంటుంది.  Samsung Galaxy M16లో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఇందులో ప్రైమరీ కెమేరా 50 మెగాపిక్సెల్ యథావిధిగా ఉంటుంది. సెల్పీ లేదా వీడియో కాలింగ్ కోసం 13 మెగాపిక్సెల్ కెమేరా అమర్చింది కంపెనీ. ఇక వైడ్ యాంగిల్ సెన్సార్ కెమేరా 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్ ఉంటాయి. ఈ రెండింట్లోనూ భ్యాటరీ 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. M06లో 4జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. అదే M16 అయితే 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్‌తో మూడు వెర్షన్లలో ఉంటుంది. Samsung Galaxy M06 ధర 9,499 రూపాయలు కాగా, Samsung Galaxy M16 ధర 11,49 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదు. మార్చ్ 7వ తేదీ మద్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమౌతాయి.

Also read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, పెండింగ్ ఎరియర్లతో పాటు డీఏ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News