Tesla Cars In India 2025: అమెరికాతో పాటు ఇతర దేశాల్లో టెస్లా కార్లకు అద్భుతమైన డిమాండ్ ఉంది. ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి అద్భుతమైన కార్లు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా టెస్లా విడుదల చేసి సైబర్ ట్రక్ గురించి పెద్దగా చెప్పనక్కర్లుదు.. ప్రీమియం ఫీచర్స్‌తో విడులైన టెస్లా కార్లలో ఇది ఒకటి.. అయితే ఈ ట్రక్‌కి మార్కెట్ అద్బుతమైన డిమాండ్ ఉంది. దీంతో పాటు టెస్లా లాంచ్ చేసిన ఇతర కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ కార్లు త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా విడుదల కాబోతున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఎలోన్ మస్క్‌తో సమావేశమయ్యారు. అంతేకాకుండా భారత్‌లో తమ టెస్లా కంపెనీని కూడా స్వాగతించారు. దీంతో టెస్లా కంపెనీ కూడా ముందుకు వచ్చి.. భారత్‌తో ప్రత్యేకమైన కార్ల తయారీ ఫ్లాంట్లు ఏర్పాటుకు సిద్ధమైంది. అంతేకాకుండా కంపెనీ ఇప్పటికే సిబ్బంది నియామకం కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే టెస్లా కంపెనీ కూడా ఈ సంవత్సరం నుంచే కార్లను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
టెస్లా కార్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే ఏయే నగరాల్లో మొదట లభిస్తాయన్న వివరాలను కూడా కొంతమంది ఆటో నిపుణులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముందుగా టెస్లా కంపెనీ భారత్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్కెట్‌లోకి విడుదల కార్లను విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల పాటు కంపెనీ కార్లను జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి దిగుమతి చేసుకుని భారత మార్కెట్‌లో విక్రయించబోతున్నట్లు తెలిపింది. అలాగే ఇప్పటికే భారత్ కస్టమర్లను ఎలోన్ మస్క్ దృష్టిలో పెట్టుకుని వ్యాపారాల్లో కొన్ని మార్పులు కూడా తీసుకు రానున్నారు.
భారత మార్కెట్‌లో టెస్లా కార్లు ధర రూ.21 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా భవిష్యత్‌లో విడుదల చేయబోయే కార్లు అతి తక్కువ ధరలోనే ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. టెస్లా కంపెనీ మొదట దేశవ్యాప్తంగా రెండు ప్రధాన నగరాల్లో కార్ల విక్రయాలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఢిల్లీతో పాటు ముంబైలలో షోరూమ్‌లను ఏర్పాటు చేసిన ఇక్కడి నుంచి కార్లను విక్రయించనుంది. అలాగే టెస్లా కంపెనీ త్వరలోనే మరిన్ని వివరాలను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









