)
Toyota Land Cruiser Fj Suv Price: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టయోటా కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ కంపెనీ కార్లను జనాలు ఎగబడి మరి కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసే కార్లలో టయోటా ఫార్చ్యూనర్ ఒకటి. ముఖ్యంగా ఈ కారుకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. లగ్జరీగా కనిపించే ఈ కారును ఎక్కువగా ధనవంతులు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని టయోటా ఫార్చ్యూనర్ తరహాలోనే కంపెనీ మరో అద్భుతమైన SUVని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇది చాలా అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టయోటా కంపెనీ విడుదల చేయబోయే కొత్త ఎస్ యు వి (SUV) టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ (toyota land cruiser fj suv) పేరుతో విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ SUV కాంపాక్ట్ డిజైన్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. చూడడానికి ఇది ఫార్చ్యూనర్లా కనిపించినప్పటికీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఈ కారుకు సంబంధించిన ఇంజన్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 2.7-లీటర్ 2TR-FE, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీని ఇంజన్ దాదాపు 163 PS శక్తితో పాటు 246 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అలాగే ఈ కారు సిక్స్ ఫీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్ ను కలిగి ఉండబోతోంది. ఫార్చ్యూనర్‌లో దాదాపు ఒకే పవర్ అవుట్‌పుట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కారుకు సంబంధించిన సస్పెన్షన్ వివరాల్లోకి వెళితే.. ల్యాండ్ క్రూయిజర్ FJ ఫార్చ్యూనర్ (toyota land cruiser fj suv)లో కంపెనీ చాలా ప్రత్యేకమైన డబుల్ విష్బోన్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంతేకాకుండా ఇందులో 4-లింక్ కాయిల్ స్ప్రింగ్ రియర్ సస్పెన్షన్‌ను అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ కారును కంపెనీ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ కారుకు సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళ్తే.. ఇది మిగిలిన మిగిలిన SUVల కంటే చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీనిని చూడడానికి బాక్సి ప్రొఫైల్లా కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ భాగంలో రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌లు కూడా కనిపిస్తాయి. ఈ కారు ల్యాండ్ క్రూయిజర్‌ను గుర్తుచేస్తుంది. ఈ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.. అయినప్పటికీ, ఈ కార్కు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఇటీవల లీకయ్యాయి. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే.. లీకైన వివరాల ప్రకారం, ఇది రూ.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ కారు వేరియంట్లను బట్టి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook